Share News

Praja Durbar: లోకేశ్ ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన

ABN , Publish Date - Jun 18 , 2024 | 12:01 PM

అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్‌కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు.

Praja Durbar: లోకేశ్ ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన

అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh) నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ ( Praja Durbar)కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్‌కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఒపిగ్గా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలను సంబధిత విభాగాల అధకారులకు పంపి పరిష్కార మార్గం చూపుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలు వింటూ...కన్నీళ్లు తుడుస్తూ...! మీ వెంట నేనున్నాంటూ ”ప్రజాదర్బార్” లో లోకేష్ భరోసా ఇస్తున్నారు.


కాగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్‌కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతిపత్రాలతో బారులు తీరుతున్నారు. సోమవారం కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి. అంగన్‌వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. వేతనాలు పెంచాలని అంగన్‌వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి, ఉద్యోగాలను కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు ఆర్థికసాయం అందించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు లోకేశ్‌ను కోరారు. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు

ఏలూరు జిల్లా: అత్తా, కోడలు ఆత్మహత్యయత్నం..

అనంతపురం జిల్లాలో అరుదైన పుట్టగొడుగు

కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 18 , 2024 | 12:36 PM