Share News

AP Ministres: తుంగభద్రకు యుద్ధప్రాతిపదికన గేట్ల ఏర్పాటు.. ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 13 , 2024 | 12:04 PM

తుంగభద్రకు యుద్ధప్రాతిపదికన గేట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) తెలిపారు. వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

AP Ministres: తుంగభద్రకు యుద్ధప్రాతిపదికన గేట్ల ఏర్పాటు.. ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు

కర్ణాటక: తుంగభద్ర డ్యాంకు యుద్ధప్రాతిపదికన గేట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) తెలిపారు. వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తుగభద్ర డ్యాంను మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ... బోర్డు ఏ నిర్ణయం తీసుకున్న సపోర్ట్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడు ప్రత్యామ్నాయ మార్గలు సూచించారని అన్నారు.


మూడు సంస్థలకు గేట్లు నిర్మాణ బాధ్యతలు అప్పగించామని వివరించారు. అత్యంత పురాతన డ్యాం రాతి కట్టడంతో నిర్మించారని తెలిపారు. డ్యాం నిర్మాణంలో ఎంతో నైపుణ్యం ఉండాలని చెప్పారు. నీళ్లు అత్యంత వేగంగా పోతున్నాయని.. టెక్నికల్‌గా చాలా ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు కలిసి ఎఫర్ట్స్ పెడుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తుంగభద్ర డ్యాంను పరిశీలించిన తర్వాత పనులను ప్రారంభిస్తామని అన్నారు. డ్యాంను చూడటానికి సందర్శకులకు అనుమతి లేదని, అత్యంత ప్రాధాన్యతతో పనులు చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.


లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు పంటలు సాగుచేస్తున్నారని చెప్పారు. వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని.. గేట్ కొట్టుకుపోయిందని తెలిసిన వెంటనే గుండె గుబేలు మందని అన్నారు. దేశంలోని ఇంజనీర్లు తుంగభద్ర డ్యాం వైపు చూస్తున్నారని చెప్పారు. నిపుణులు సూచించిన మార్గాలను కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.


సమస్యను త్వరగా పరిష్కరిస్తాం : మంత్రి రామానాయుడు

Minister-Nimmala.jpg

లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సమస్యతో విలువైన సాగు, తాగు నీటిని కోల్పోతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గేట్ల ఏర్పాటులో కీలకమైన కన్నమ్మ నాయుడు నేతృత్వంలో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద 5 గేట్లను ఏకకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు కష్టతరమైన పని చెప్పారు. డ్యాం వద్ద 1625 అడుగులు నీరు ఉండగానే గేట్లు అమర్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 12:11 PM