Share News

Tirumala Laddu Issue: నిజాన్ని నిగ్గు తేల్చండి.. ప్రధానికి జగన్ లేఖ

ABN , Publish Date - Sep 22 , 2024 | 03:20 PM

తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు. ఏదైనా పొరపాటు జరిగిఉంటే విచారణ చేయించి ..

Tirumala Laddu Issue: నిజాన్ని నిగ్గు తేల్చండి.. ప్రధానికి జగన్ లేఖ
YS Jagan

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ జగన్ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు టీటీడీ ప్రతిష్టను దిగజార్చారంటూ జగన్ ఆరోపించారు. కొందరు నాయకులు టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు. ఏదైనా పొరపాటు జరిగిఉంటే విచారణ చేయించి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాలని జగన్ రాసిన లేఖలో ప్రస్తావించారు. మరోవైపు తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల వ్యర్థాలు కలిశాయంటూ ల్యాబ్ రిపొర్టులో తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనకు అంటిన మరకను తుడుచుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగానే ప్రధానికి లేఖ పేరుతో మరో డ్రామాకు తెరతీశారనే విమర్శలు వస్తున్నాయి.

Narendra Modi: గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన


గతంలో స్పందించి ఉంటే..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో నాసిరకం నెయ్యి సరఫరా చేసే సంస్థకు టెండర్లు అప్పగించారు. లోపాయికారీగా కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసినా గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ స్పందించి ఉంటే తిరుమల లడ్డూ విషయంలో అసలు వివాదమే వచ్చే అవకాశం ఉండేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత వైసీసీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కోట్లాది మంది భక్తులు బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా.. ప్రస్తుతం ప్రధానికి లేఖ రాయడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు కొనసాగితే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఢిల్లీ సీఎం పీఠంపై ఆతిశీ


వైసీపీ ప్రభుత్వంలోనే..

తిరుమల లడ్డూ తయారీకోసం ఉపయోగించే నెయ్యి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే లడ్డూ రుచి, నాణ్యత తగ్గిందని ఎంతోమంది భక్తులు ఫిర్యాదు చేసినా టీటీడీ లేదా ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. నాణ్యత గతంతో పోలిస్తే మరింత పెరిగిందని ప్రభుత్వం కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ల్యాబ్ రిపోర్టులు బయటపడటంతో గతంలో జరిగిన అక్రమాలు, మోసాలు బయటపడుతున్నాయి. లడ్డూ వివాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది వేచి చూడాలి.


నూతన వైమానిక దళాధిపతిగా ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌

Rahul Gandhi : నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Rain Alert: ఐఎండీ అలర్ట్.. వచ్చే 3 రోజులు మళ్లీ వర్షాలు

Updated Date - Sep 22 , 2024 | 03:20 PM