Minister Narayana: దూకుడుగా రాజధాని నిర్మాణాలు .. మంత్రి నారాయణ కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:55 PM
రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు.రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే రూ. 21 వేల కోట్ల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని చెప్పారు.
అమరావతి: సీడ్ యాక్సెస్ రహదారినీ జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని పరిధిలోని రహదారులను జాతీయ రహదారికి అనుసంధానించే ప్రాంతాల్లో మంత్రి నారాయణ ఇవాళ(శనివారం) పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ...రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే రూ. 21 వేల కోట్ల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని చెప్పారు.
ఈ నెల 16 తేదీన మరో రూ.20 వేల కోట్ల మేర పనులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలియజేసే అవకాశం ఉందన్నారు. రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి లీ కన్సల్టెన్సీకి డీపీఆర్ రూపకల్పనకు ఇచ్చామని చెప్పారు. ఎయిమ్స్‌కి అనుకుని ఉన్న కొండ పక్కనే ఈ -13 రహదారి, డీజీపీ కార్యాలయం పక్క నుంచి ఈ - 11 రహదారి వెళ్లేలా డిజైన్ చేస్తున్నామని వివరించారు. అతి తక్కువ భూ సేకరణ తో ఈ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. మొత్తంగా అమరావతి నుంచి 3 ట్రాంక్ రోడ్‌లు జాతీయ రహదారితో అనుసంధానం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
రైతులకు అండగా మంత్రి నారాయణ..
కాగా.. అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ ఉండనున్నారు. భూములు ఇవ్వడానికి ముందుకువస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరిస్తున్నారు. రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. రాజధాని కోసం రైతులు కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో ల్యాండ్ పూలింగ్‌కి కొంత భూమి ఇవ్వలేదని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu: జమిలి అమలు అయినా.. ఎన్నికలు మాత్రం
Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు
మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu News