Minister Narayana: గుంటూరు కార్పొరేషన్ సమస్యలపై మంత్రి సమీక్ష..
ABN , Publish Date - Jul 16 , 2024 | 09:29 PM
కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) సమీక్ష నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్(MLA Naseer), మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షలో పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై మంత్రి వారితో చర్చించారు.
గుంటూరు: కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ(Minister Ponguru Narayana) సమీక్ష నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్(MLA Naseer), మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షలో పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై మంత్రి వారితో చర్చించారు. మొండిగటం, అగత్తవరప్పాడు డ్రైనేజీలు పొంగడం, కల్వర్టుల కింద పూడికతీత అంశాలపైనా చర్చ సాగింది.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చెత్తను మాన్యువల్‌గా, పశ్చిమ నియోజకవర్గంలో ఈ-ఆటోల ద్వారా సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. రెండ్రోజుల్లో కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కీర్తికి మంత్రి నారాయణ సూచించారు. గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి ఆ శాఖ సమస్యలు వివరించారు.