Share News

Minister Narayana: రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి దిగిన మంత్రి నారాయణ

ABN , Publish Date - Sep 15 , 2024 | 08:51 PM

రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములిచ్చేందుకు రైతులుముందుకొస్తున్నారు.

Minister Narayana: రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి దిగిన మంత్రి నారాయణ
Minister Narayana

అమరావతి: రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు ఈరోజు(ఆదివారం) మంత్రి వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములిచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... ఎర్రబాలెంలో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరించినట్లు తెలిపారు. ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.


ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుగా భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న భూముల్లో ప్లాట్‌ల కేటాయింపులు చేపట్టినట్లు వివరించారు. భూములిచ్చిన మరుసటి రోజే ప్లాట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారని మంత్రి నారాయణ వెల్లడించారు.


భూములు ఇచ్చే రైతుల ఇంటికి నేరుగా తానే వస్తానని చెప్పారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు కొంత మేర భూములు మాత్రమే అవసరమని అన్నారు. కాబట్టి ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు.


ఏపీ ప్రభుత్వం దగ్గర ఎక్కడ భూమి ఉందో...అక్కడ వారు కోరుకున్న ప్లాట్లు ఇస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అపహస్యం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..

AP News: వైసీపీ నేతల మీద అక్రమ కేసులు.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్.. ఏమన్నారంటే?


Updated Date - Sep 15 , 2024 | 08:55 PM