Share News

Minister Ram Mohan: పౌర విమానయాన రంగం అభివృద్ధిపై మంత్రి రామ్మోహన్ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Sep 09 , 2024 | 06:15 PM

పౌర విమానయానంపై ఢిల్లీలో రెండు రోజుల పాటు రెండో ఆసియా పసిఫిక్ సివిల్ ఏవియేషన్ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

Minister Ram Mohan: పౌర విమానయాన రంగం అభివృద్ధిపై మంత్రి  రామ్మోహన్ కీలక నిర్ణయాలు

ఢిల్లీ: పౌర విమానయానంపై ఢిల్లీలో రెండు రోజుల పాటు రెండో ఆసియా పసిఫిక్ సివిల్ ఏవియేషన్ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కాగా, ముగింపు కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారని తెలిపారు.


ALSO READ:Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ఈ నెల 11, 12 తేదీల్లో “భారత మండపం” లో జరిగే సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొంటున్న 41 దేశాలకు చెందిన పౌరవిమానయాన శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధి, 41 దేశాల మధ్య విమాన సౌకర్యాలను మెరుగు పరచడంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ALSO READ:Sam Pitroda: రాహుల్ పప్పు కాదు.. ఆయనలో క్వాలిటీస్ చెప్పిన శామ్ పిట్రోడా

మెరుగైన వస్తు రవాణాతో పాటు, పరస్పర సహకారంతో పాటు, అనుభవాలను పంచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. భారత పౌర విమానయానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. గ్రీన్ ఫీల్డ్, ఎయిర్ పోర్ట్‌లు, ప్రయాణ సౌకర్యాలు, ఫ్యూయల్, పౌర విమానయాన వ్యవస్థల అభివృద్ధిపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. చైనా హాజరుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


విజయవాడ జక్కంపూడిలో మంత్రుల పర్యటన

విజయవాడ: విజయవాడలోని జక్కంపూడిలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, ఇంటూరి నాగేశ్వరరావు ఈరోజు(సోమవారం) పర్యటించారు. వరద బాధితుల ఇళ్లకు నేతలు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఇవాళ సాయంత్రానికి కాలనీలో అన్ని బ్లాకులకు విద్యుత్ సరఫరా వచ్చేలా చేస్తామని మంత్రులు పేర్కొన్నారు.


బాధితులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. కాలనీ మొత్తం శానిటేషన్ చేయిస్తామని తెలిపారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, బైక్‌లకు ఆయా కంపెనీలతో మాట్లాడి ఉచితంగా రిపేరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుందని మాటిచ్చారు. బుడమేరు గండి పూడ్చి వరదను అరికట్టామని మంత్రులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: ప్రజల కోసమే నా జీవితం అంకితం

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

Read LatestAP News And Telugu News

Updated Date - Sep 09 , 2024 | 10:19 PM