Minister Suresh: 50 మున్సిపాలిటీల్లో మాత్రమే సమ్మె ప్రభావం
ABN , Publish Date - Jan 02 , 2024 | 10:05 PM
మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ఆయా సంఘాలతో చర్చలు జరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Suresh ) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. నాన్ పీహెచ్ కేటగిరీ ఉద్యోగులకూ రూ.6 వేల ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తామని మంత్రి సురేష్ చెప్పారు.
అమరావతి: మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ఆయా సంఘాలతో చర్చలు జరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Suresh ) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. నాన్ పీహెచ్ కేటగిరీ ఉద్యోగులకూ రూ.6 వేల ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పారు. స్కిల్, అన్ స్కిల్ సిబ్బంది విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. రోస్టర్, పీఫ్ ఖాతాలు, ఎక్స్ గ్రేషియా అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. మరికొన్ని అంశాలపై మరోమారు చర్చిస్తామన్నారు. అప్పటి వరకూ కార్మికుల సమ్మె విరమించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అని నవరత్నాలల్లో పేర్కొన్నామన్నారు. కేవలం 50 మున్సిపాలిటీల్లో మాత్రమే సమ్మె ప్రభావం ఉందన్నారు. ఇబ్బందులు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
కార్మిక సంఘాల చర్చల్లో కొంత పురోగతి
కాగా.. మున్సిపల్ కార్మిక సంఘాల చర్చల్లో కొంత పురోగతి వచ్చింది. దశలవారీగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేందుకు.. సీఎం జగన్‌తో మాట్లాడతామని GMO హామీ ఇచ్చారు. అంతవరకు బేసిక్ పీఆర్సీ ఇవ్వాలని మున్సిపాలిటీ వర్కర్ల నాయకులు అడిగారు. సీఎం జగన్‌తో మాట్లాడి ఈ నెల 12వ తేదీన కానీ, 17వ తేదిన కానీ మరోసారి జీఎంవో చర్చిస్తామని చెప్పారు. సమ్మె విరమించాలని జీఎంవో కోరారు.