TDP: సీఎం జగన్‌కు కులపిచ్చి పరాకాష్టకు చేరింది: ఎమ్మెల్యే అనగాని
ABN , Publish Date - Feb 09 , 2024 | 10:17 AM
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డికి కులపిచ్చి పరాకాష్టకు చేరిందని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని, కాపు, బలిజలను జగన్ రెడ్డి రాజకీయంగా అణిచివేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డికి కులపిచ్చి పరాకాష్టకు చేరిందని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని, కాపు, బలిజలను జగన్ రెడ్డి రాజకీయంగా అణిచివేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కంటే తన సామాజిక వర్గమే ఎక్కువని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో జగన్ రెడ్డి నిరూపించారని అన్నారు. మూడు రాజ్యసభ సీట్లలో రెండు సొంత వర్గానికి కేటాయించడం.. జగన్ రెడ్డి చెబుతున్న సామాజిక న్యాయమంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
రాయలసీమలో ప్రధానమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌కు మొదట రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రకటించారని, తడి ఆరక ముందే ఆయనను తొలగించి సొంత సామాజిక వర్గానికి చెందిన మేడా రఘునాధ రెడ్డికి కేటాయించడం బలిజల గొంతు కోయడం కాదా? అని అనగాని సత్య ప్రసాద్ ప్రశ్నించారు. రాజంపేట లోక్ సభ సీటు కూడా సొంత సామాజిక వర్గానికే అప్పగించారన్నారు. ఇప్పుడు మరోసారి వంచించారని, నమ్మించి మోసం చేయడం.. నమ్మించి గొంతులు కోయటం జగన్ జీన్స్‌లోనే ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలంటే జగన్ రెడ్డికి ముందు నుంచీ చిన్నచూపని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు.