Chandrababu: ప్రజావేదికపై చంద్రబాబు, లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ
ABN , Publish Date - Jul 01 , 2024 | 09:13 AM
అమరావతి: గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..
అమరావతి: గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) పెన్షన్ల పంపిణీ (Pensions Distribution) కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని, మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి నివేదించారు. సీడ్ యాక్సిస్ రహదారి పూర్తి, అమరావతి నిర్మాణంలోనూ మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారని, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నందున అందుకు సహకరించాలని సీఎం చంద్రబాబును లోకేష్ కోరారు. గత అయిదేళ్ళు పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నామని అన్నారు.
లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధికారులు మారటానికి కొంచెం టైమ్ పట్టినా, త్వరలోనే సెట్ అవుతారని అన్నారు. 1995 తరహాలో సీఎం 4.0 చంద్రబాబును ఇక ప్రజలు చూస్తారని, రాజధానిలో భాగమైన మంగళగిరిలో అభివృద్ధిని పరుగులెత్తిస్తామని అన్నారు. గతంలో సీడ్ యాక్సిస్ రహదారి విస్తరణకు పెనుమాక ప్రజలు సహకరించలేదని.. ఈసారి ఎవ్వరూ అడ్డుపడకుండా రహదారి పూర్తికి అంతా సహకరిస్తారని ఆశిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ ఆ మాట చెప్పినప్పుడు ఏడ్చాను..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News