Pawan Kalyan: అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే..: పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Jun 15 , 2024 | 05:00 PM
ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి: ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని అన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా చూశానని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు.
ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా తాను భావిస్తున్నానని అన్నారు. ఈరోజు(శనివారం) సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... 2014 నుంచి తాను రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పర్యటనల సందర్భంగా అనేక కష్టాలు కన్నీళ్లు చూశానని చెప్పారు. ఆడపడుచులు గుక్కెడు నీళ్ల కోసం పడుతున్న అవస్థలు తనకు ఆవేదన కలిగించాయన్నారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి అని ఉద్ఘాటించారు. పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలని.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలని కోరుకున్నారు. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ సమాజానికి అవసరమని చెప్పుకొచ్చారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేమని అన్నారు. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్లడానికి చేయూతనిస్తామన్నారు. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తామని వివరించారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి తన మదిలో ఎప్పుడూ మార్మోగుతుంటుందన్నారు. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతువు. అలాంటి అడవులను కంటికి రెప్పలా కాపాడతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు
AP Politics: ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా.. అహంకారంతో ముందుకెళ్తారా..!
AP Politics: పాలనలో సంస్కరణలకు శ్రీకారం.. గతానికి.. ప్రస్తుతానికి స్పష్టమైన తేడా..
Actor Suman: కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్
Read Latest AP News and Telugu News