AP NEWS: విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత.. కారణమిదే...
ABN , Publish Date - Dec 19 , 2024 | 07:10 AM
విజయవాడలో మరోసారి లైలా కాలేజ్ వాకర్స్ నిరసన చేపట్టారు. సీపీ దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో పది రోజులు గడువు ఇవ్వమని ఆ తర్వాత నడుచుకోవచ్చని వాకర్లకు సీపీ హామీ ఇచ్చారు. 20 రోజులు దాటిన ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడంతో వాకర్స్ తిరిగి నిరసనకు దిగారు.

అమరావతి: విజయవాడ (Vijayawada)లో మరోసారి నడక కోసం లైలా కాలేజ్ వాకర్స్(Loyola College Walkers) శాంతియుత నిరసన పోరాటం ప్రారంభించారు. గత 25 సంవత్సరాలుగా లైలా కాలేజ్ వాకర్స్ పేరుతో లయోలా కాలేజీలో నగరవాసులు వాకింగ్ చేస్తున్నారు. కోవిడ్ సాకుతో వాకర్స్‌ను కాలేజీలోకి రాకుండా ఆంక్షలు కాలేజ్ యాజమాన్యం విధించారు. గత నెల పదో తేదీన కళాశాల ప్రధాన గేటుని నెట్టుకుని లోపలికి వాకర్స్ వెళ్లారు.
రెండు రోజుల పాటు సాఫీగా నడిచిన తర్వాత బయట వారికి అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కళాశాల యాజమాన్యం తాళాలు వేసింది. వాటిని లెక్కచేయకుండా గేట్లను నెట్టుకుని లోపలికి వాకర్స్ వెళ్లారు. సీపీ దృష్టికి వెళ్లడంతో పది రోజులు గడువు ఇవ్వమని ఆ తర్వాత నడుచుకోవచ్చని వాకర్లకు సీపీ హామీ ఇచ్చారు. 20 రోజులు దాటిన ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడంతో వాకర్స్ తిరిగి నిరసనకు దిగారు. తక్షణం కళాశాల గేట్లు ఓపెన్ చేయాలంటూ ప్రధాన గేటు వద్ద లైలా వాకర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు.
కాలేజీ యాజమాన్యం తీరుపై లయోలా కాలేజ్ వాకర్స్ ఆగ్రహం
కాగా.. విజయవాడలో నడక కోసం లయోలా కాలేజ్ వాకర్స్ పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 25 సంవత్సరాలుగా నగరవాసులు లయోలా కాలేజ్ వాకర్స్ పేరుతో లయోలా కాలేజీలో వాకింగ్ చేస్తున్నారు. అయితే కోవిడ్ సాకుతో కాలేజ్ యాజమాన్యం వాకర్స్‌ని కాలేజీలోకి రాకుండా ఆంక్షలు విధించింది. కేవలం ఐఏఎస్‌లు, ఐపీఎస్ అధికారులకు మాత్రమే నడిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కాలేజీ యాజమాన్యం తీరుపై లయోలా కాలేజ్ వాకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం తీరుకు నిరసనగా వాకర్స్ ఆందోళనకు దిగారు.
ఈ విషయాన్ని వాకర్స్ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా.. సమస్య పరిష్కారం కాలేదు. దాదాపు 3 వేల మందిపై చిలుకు సభ్యులతో లయోలా వాకర్స్ క్లబ్ పెద్ద అసోసియేషన్‌గా ఉంది. కోవిడ్ సమయంలో వాకింగ్ ట్రాక్‌ను కళాశాల మూసివేసింది. కోవిడ్ తర్వాత నుంచి వాకింగ్ ట్రాక్ తెరవాలంటూ అసోసియేషన్ ఒత్తిడి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాకింగ్ ట్రాక్ తెరిపిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వాకింగ్ ట్రాక్ తెరవాలంటూ లయోలా కళాశాల యాజమాన్యాన్ని ఎన్ని సార్లు కోరినా అనుమతి నిరాకరిస్తుండటంతో నగర వాసులు కళాశాల ముందు ధర్నాకు దిగారు. గేట్లకు తాళాలు వేసి ఉండటంతో వాటిని పగలకొట్టి గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లి నడక ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Cabinet meeting: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..
Pawan Kalyan: ‘జల్‌జీవన్’లో జనం భాగస్వామ్యం
Kakinada: డమ్మీ పిస్టల్‌తో బెదిరించి.. బంగారం దోచేసి..!
Read Latest AP News and Telugu News