Share News

Pullarao: రూ. లక్ష చెల్లించి టీడీపీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:45 AM

వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికే 4 నెలలు పట్టిందని, వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

Pullarao: రూ. లక్ష చెల్లించి టీడీపీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి

పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో నిర్వహించిన టీడీపీ (TDP) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prattipati Pullarao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష రూపాయలు (Rs. One lakh) చెల్లించి తెలుగుదేశంలో క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్‌ (Super Six)తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను దశలవారీగా అమలుచేస్తున్నామన్నారు. జగన్‌రెడ్డి (Jagan Reddy) కబంధహస్తాల నుంచి రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికే 4 నెలలు పట్టిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమంతోనే టీడీపీ బలం..

దేశంలోనే వేరే ఏ రాజకీయ పార్టీకి లేని రీతిలో ఉన్న సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమం చూడడంలోనే తెలుగుదేశం పార్టీ బలమంతా ఉందని, పార్టీ అధ్యక్షుడి నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు చూపే క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు తిరుగులేని అదనపు బలాలని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సభ్యత్వ నమోదు, కమిటీలు, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వరకు అన్నింటా అది కనిపిస్తోందన్నారు.


కాగా చిలకలూరిపేట 9వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించడం జరిగిందని, కార్యకర్తల సమక్షంలో ఆన్‌లైన్‌లో రూ.లక్ష చెల్లించి పార్టీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నానని ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఈ సారి పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందని, రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచారన్నారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి సాధారణంగా చనిపోయినా ఆ రోజే అంత్యక్రియలకు రూ.10 వేలు అందించనున్నారని, దేశంలోని రాజకీయ పార్టీల్లో కార్యకర్తల సంక్షేమం కోసం బీమా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశమని అన్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు అర్హులైన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటును కూడా నమోదు చేసుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

కాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రూ.100 కట్టి సీఎం చేతుల మీదుగా మెుదటి సభ్యత్వాన్ని తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వందల, వేల మంది కార్యకర్తల కృషి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ పార్టీ సేవలు అందించగలుగుతుందని అన్నారు. ఆపద సమయంలో వారిని ఏ విధంగా ఆదుకుంటామో చేసి చూపిస్తామని సీఎం చెప్పారు. పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు, నేతలు వివిధ స్థాయిల్లో కష్టపడి పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పోరాడి అనేక కేసులు పెట్టించుకున్నారని, జైలుకు వెళ్లారని, ఆస్తులు పోగొట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు. అలాంటి వారికి కచ్చితంగా టీడీపీ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన పలువురు కార్యకర్తలతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. గతంలో ఇన్స్యూరెన్స్ రాని 73 మందికి రూ.2లక్షల చొప్పున చంద్రబాబు అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి: మంత్రి పొన్నం

స్వంత నిధులతో ముందడుగు వేసాం: కేటీఆర్

7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల పిన్సిపాళ్ల బదిలీ

ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేష్

కుమిలిపోతున్న అమ్మ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 27 , 2024 | 11:45 AM