YCP: ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌చార్జ్ బాలసాని కిరణ్‌కు నిరసన సెగ
ABN , Publish Date - Jan 02 , 2024 | 02:38 PM
Andhrapradesh: ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌చార్జ్ బాలసాని కిరణ్‌కు నిరసన సెగ తగిలింది. మంగళవారం పెదనందిపాడులో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో కిరణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఇన్‌చార్జ్, మండల కన్వీనర్ పాల్గొనడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం పెన్షన్‌ల పంపిణీలో పార్టీ వ్యక్తుల ప్రమేయం ఏంటని వైసిపి ఎంపీటీసీ నాగు నిలదీశారు.
గుంటూరు, జనవరి 2: ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌చార్జ్ బాలసాని కిరణ్‌కు (Prattipadu YCP in-charge Balasani Kiran) నిరసన సెగ తగిలింది. మంగళవారం పెదనందిపాడులో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో కిరణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఇన్‌చార్జ్, మండల కన్వీనర్ పాల్గొనడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం పెన్షన్‌ల పంపిణీలో పార్టీ వ్యక్తుల ప్రమేయం ఏంటని వైసిపి ఎంపీటీసీ నాగు నిలదీశారు.
ఈ క్రమంలో వైసీపీ ఎంపీటీసీ నాగు - వైసీపీ మండల కన్వీనర్‌ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో రెండు వర్గాలుగా విడిపోయి తోపులాటలు జరిగాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రభుత్వ కార్యక్రమం నుంచి ఎంపీటీసీ నాగును బయటకు పంపించి వేశారు. పోలీసుల తీరు పట్ల ఎంపీటీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో వైసీపీ ఇన్‌చార్జ్ కిరణ్ కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్లిపోయారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...