Sailajanath: వైద్యురాలిని హత్య చేసిన నిందితులని కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Aug 15 , 2024 | 01:16 PM
వెస్ట్ బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌ని అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హింసించి హత్య చేశారని ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ (Sailajanath) అన్నారు. డాక్టర్ హత్యని నార్మల్ సంఘటనలా ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి: వెస్ట్ బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌ని అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హింసించి హత్య చేశారని ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ (Sailajanath) అన్నారు. డాక్టర్ హత్యని నార్మల్ సంఘటనలా ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తుని చూస్తుంటే బాదేస్తుందని చెప్పారు. గురువారం నాడు విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ... కరోనా సమయంలో ఎంతో మంది డాక్టర్లు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO Read: Soy Candles : సోయా క్యాండిల్ ఎంత స్పెషల్ అంటే.. !
ట్రైనీ డాక్టర్‌ని చాలా హింసించి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి కూతురి మొఖం కూడా చూపించలేదని వాపోయారు. వైద్యురాలిని చంపిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలను సమాజం ఉపేక్షించకూడదని చెప్పారు. అక్కడ సాక్ష్యాలని కొందరు దుండుగులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. ప్రొటెస్ట్ చేసేవారిపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులని వెంటనే కఠినంగా శిక్షించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు..
మరోవైపు.. దేశ ప్రజలకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila). స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం నాడు విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్య్రమని అన్నారు. మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నామని చెప్పారు. గత పదేళ్లుగా బీజేపీ (BJP) ఈ దేశంలో అధికారంలో ఉందన్నారు. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ (Congress) పార్టీ అని షర్మిల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: మా ప్రభుత్వంలో రాజకీయ కక్షకు తావులేదు... కానీ
Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం.. ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..!
Read Latest AP News And Telugu News