Share News

Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట..

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:03 PM

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది.

Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట..

ఢిల్లీ: ఓటుకు నోటు కేసు(Note-For-Vote case)లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)కు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. దాఖలైన రెండు పిటిషన్లను జస్టిస్ సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారించింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మందలించింది. ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.


CM-Chandrababu.jpg

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వాడుకోవద్దని పిటిషనర్ రామకృష్ణారెడ్డిని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఆధార రహిత అంశాలను తీసుకువచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దంటూ తీవ్రంగా స్పందించింది. పిటిషనర్‌ రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. ఈ సందర్భంగా పిటిషనర్ 2014 నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిపక్షంలో ఉందని సీఎం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.


supreme court.jpg

కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని తప్ప రాజకీయ కక్షల కోసం ధర్మాసనం వద్దకు రావొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట ఓ జాబితా పెట్టారు. ఆ కేసులకు, ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. కేసుల జాబితా చూశాక పిటిషనర్‌ రామకృష్ణారెడ్డిపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనపడటం లేదని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh: బాబు కాదు.. ఢిల్లీలో ఇకపై చక్రం తిప్పేది చినబాబేనట..!!

Rajendraprasad: పంచాయతీల అభివృద్ధికి రూ.900 కోట్లు జమ చేయడంపై వైవీబీ హర్షం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 21 , 2024 | 03:46 PM