Share News

Guntur: గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆ ఆలయం నిధులు దోచుకున్నారు: భాను ప్రకాశ్ రెడ్డి..

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:37 PM

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి పాలనలో దేవాలయాలు, విగ్రహాలపై దాడులు పెరిగాయని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పలు ఆలయాలకు చెందిన రథాలను సైతం కాల్చివేసిన ఘటనలు వెలుగు చూశాయని భాను ప్రకాశ్ మండిపడ్డారు.

Guntur: గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆ ఆలయం నిధులు దోచుకున్నారు: భాను ప్రకాశ్ రెడ్డి..
TTD board member Bhanu Prakash Reddy

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో దేవాలయాలకు మంచి రోజులు వచ్చాయని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt)లో గుడిని గుడిలో లింగాన్ని సైతం మింగేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు తిరుమల స్వామివారి దేవస్థానంలో పరకామణి చోరీ సంఘటన నిదర్శనమని భాను ప్రకాశ్ ఆరోపించారు. భక్తులు సమర్పించే కానుకలను పరకామణి నుంచి దొంగిలించిన వ్యక్తితో లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


గత ప్రభుత్వంలో కొందరు పెద్దలు టీటీడీకి చెందిన వందల కోట్ల రూపాయలతో జేబులు నింపుకున్నారని భాను ప్రకాశ్ ధ్వజమెత్తారు. తిరుమలలో దోపిడీపై విచారణ కోసం ఏపీ డీజీపీని కలవబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం దేవాలయాల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాలయాలు, విగ్రహాలపై దాడులు పెరిగాయని ఆయన మండిపడ్డారు. పలు ఆలయాలకు చెందిన రథాలను సైతం కాల్చివేసిన ఘటనలు వెలుగు చూశాయని భాను ప్రకాశ్ ధ్వజమెత్తారు. తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.

AP News: డెడ్ బాడీ పార్శిల్ కేసు.. నిందితుడి అకౌంట్‌లో రూ.2 కోట్లు.. ట్విస్ట్ మామూలుగా లేదు..


వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఏ దేవాలయం నుంచి కూడా ఒక్క రూపాయి నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించకూడదని ఆయన డిమాండ్ చేశారు. మన హిందూ ఆలయాలను మనమే కాపాడుకోవాలని భాను పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి విజయవాడలో జనవరి 5న జరిగే శంఖారావం కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణకు తీర్మానం చేయనున్నట్లు భాను ప్రకాశ్ వెల్లడించారు.

Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం..


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: మాజీ ప్రధాని మన్మోహన్ మృతి.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన తెలుగు ప్రముఖులు...

Veeranjaneyaswamy: అంతా చేసి ఏమీ ఎరుగనట్టు ధర్నాలా.. సిగ్గు చేటు

Updated Date - Dec 27 , 2024 | 03:25 PM