AP News: కంచి నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్రం.. విజయేంద్ర సరస్వతి స్వామీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 27 , 2024 | 06:38 PM
అయోధ్య రామాలయానికి కంచి మఠం సమర్పిస్తున్న శ్రీరామ యంత్రాన్ని"(శ్రీచక్రం ) పూజలు నిర్వహించి ఊరేగింపుగా తిరుపతి నుంచి అయోధ్యకు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ పంపించారు.
తిరుపతి: అయోధ్య రామాలయానికి కంచి మఠం సమర్పిస్తున్న శ్రీరామ యంత్రాన్ని(శ్రీచక్రం ) పూజలు నిర్వహించి ఊరేగింపుగా తిరుపతి నుంచి అయోధ్యకు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ పంపించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీ మీడియాతో మాట్లాడుతూ.. దశరధుడికి కంచితో ఉన్న అనుబంధం దృష్ట్యా పంచలోహాలతో శ్రీరామ యంత్రాన్ని రూపొందించినట్లు విజయేంద్ర సరస్వతి స్వామీ తెలిపారు.
27వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాల మీదుగా 1800 కిలోమీటర్లు యాత్రగా శ్రీరామయంత్రం అయోధ్యకు చేరుకుంటుందని వివరించారు. నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు అయోధ్యలో మహా చండి యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహా చండీయాగంలో శ్రీరామ యంత్రాన్నిపెట్టి పూజలు చేస్తామని అన్నారు. ఆ తర్వాత యంత్రాన్ని ఉత్తరాయణంలో అయోధ్యలోని రామ మందిరంలో పూజల కోసం సమర్పిస్తామని విజయేంద్ర సరస్వతి స్వామీ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?
AP Politics: జగన్‌కు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే..
Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: పవన్ కళ్యాణ్
For AndhraPradesh News And Telugu News