Share News

CM Chandrababu: తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలే జగన్

ABN , Publish Date - Sep 24 , 2024 | 01:07 PM

తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వంసం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని జగన్ విశ్వసించేవారా అని సూటిగా ప్రశ్నించారు. దేవుడిని నమ్మకుంటే దర్శించుకోవడం ఎందుకు.. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని నిలదీశారు.

CM Chandrababu: తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలే జగన్
CM Chandrababu

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలపై నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఆనాటి భక్తుల మనోభావాలను పాలకులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోవడంలో ఇబ్బంది లేదు. నిజంగా ఆయనకు శ్రీవారిపై విశ్వసం ఉందా లేదా అనేది ముఖ్యం అని వివరించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు.


CM-Chandrababu.jpg


డిక్లరేషన్ కంపల్సరీ

సంప్రదాయం ప్రకారం అన్యమతస్థులు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఇచ్చే బాధ్యతను జగన్ మరిచారని మండిపడ్డారు. సంప్రదాయాన్ని గౌరవించకుంటే తిరుమల ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాలని గతంలో ప్రజలు అధికారం అప్పగించారు. అందుకు జగన్ విరుద్దంగా వ్యవహరించారు.


ys-jagan.jpg


నిర్లక్ష్యంగా సమాధానం

రథం కాలిపోతే తేనేటీగలు వచ్చాయని కబుర్లు చెప్పారు. తిరుమల పోటులో ప్రమాదం జరిగితే ఏమవుతుందని కామెంట్ చేశారు. ప్రతిసారి జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పవిత్రమైన ఆలయంలో అపచారం చేసి అబద్ధాలను నిజం చేయాలని చూశారు. అది ముమ్మాటికీ ద్రోహం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


chandrababu-bc.jpg


సమీక్ష

అమరావతి సచివాలయంలో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేశ్ చంద్ర లడ్హ, ఐజి లా అండ్ ఆర్డర్ శ్రీకాంత్, ఏపీఎస్ప్ డీఐజీ బీ రాజా కుమారితో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. తిరుపతి లడ్డూ ప్రసాదం పై సిట్ ఏర్పాటు, అనంతపురంలో రథం దగ్ధం, శాంతి భద్రతల అంశాలపై చర్చిస్తున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది నెయ్యి కలిసిందని తేలడంతో విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.


tirumala.jpg


ఆరా

అనంతపురం జిల్లాలో రథం దగ్ధమయ్యింది. కనేకల్ మండలం హనకనహల్‌లో అర్ధరాత్రి ఆలయ రథం కాలిపోయింది. ఆగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయిందని జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

Tirumala Laddu Controversy: పొన్నవోలు, ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్


మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 24 , 2024 | 01:12 PM