Share News

YSRCP: బెంగళూరు నుంచి వచ్చారు.. మరో కుట్రకు తెరలేపారు

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:47 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు పొందిన ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందనే విషయం స్పష్టమైంది. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి ట్యాంకర్లు పంపిస్తే వాటిని వెనక్కి పంపించామని వైసీపీ నాయకులే చెబుతున్నారు. గతంలోనే కల్తీ నెయ్యి పంపిస్తే.. ఆ సంస్థను..

YSRCP: బెంగళూరు నుంచి వచ్చారు.. మరో కుట్రకు తెరలేపారు
Tirumala Laddu

తిరుమల లడ్డూ వివాదంలో అడ్డంగా ఇరుక్కున్న వైసీపీ.. వివాదం నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులు నిర్థారించడంతో ఆ మరకలు తమపై పడకుండా జాగ్రత్త పడేందుకు వైసీపీ అధ్యక్షులు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. లడ్డూ వివాదంలో వైసీపీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని, శ్రీవారి భక్తులంతా ఆగ్రహంగా ఉన్నారని వైసీపీ నాయకులు జగన్ తో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ నేతలంతా లడ్డూ వివాదంపై తప్పుడు ప్రచారం చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. లడ్డూ విషయంలో టీడీపీ రాజకీయాలు చేస్తోందంటూ ప్రచారం చేయాలని, శ్రీవారితో రాజకీయాలు చేస్తుందనే ఓ అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నించాలని నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సెప్టెంబర్ 28న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారంటూ ఆ పార్టీ నేతలు పేర్ని నాని ప్రకటించారు. ఓ వైపు తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి.. మరోవైపు శ్రీవారిపై లేని ప్రేమ చూపించడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu: బోట్ల ఘటన.. కచ్చితంగా వైసీపీ కుట్రే


పూజలతో డ్రామా..

వైసీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు పొందిన ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందనే విషయం స్పష్టమైంది. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి ట్యాంకర్లు పంపిస్తే వాటిని వెనక్కి పంపించామని వైసీపీ నాయకులే చెబుతున్నారు. గతంలోనే కల్తీ నెయ్యి పంపిస్తే.. ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నా.. ఆ సంస్థను వైసీపీ ప్రభుత్వం, అప్పటి టీటీడీ పాలకమండలి, అధికారులు ప్రోత్సహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓ విధంగా ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోకుండా కల్తీ నెయ్యి సరఫరాను ప్రోత్సహించిన వైసీపీ ప్రభుత్వం టీటీడీ లడ్డూ వివాదంలో తమకు సంబంధం లేదంటూ చెప్పే ప్రయత్నం చేయడం విడ్డూరంగా అనిపిస్తోందట.

AP Govt: వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నష్ట పరిహార వివరాలు ఇవే


తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని, తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ పిలుపునివ్వడం చూస్తుంటే.. తప్పు చేసిన వ్యక్తి.. మరెవరో తప్పు చేశారంటూ ఆరోపించినట్లుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎంగా ఉన్న సమయంలో జగన్ తిరుమల పవిత్రత, ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో పూజలు చేయడం మర్చిపోయిన జగన్ ఇప్పుడు పూజల పేరుతో డ్రామాకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.


AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 25 , 2024 | 04:47 PM