AP News: అంబటి అనుచరుల వీరంగం.. యూత్ కాంగ్రెస్ నేతలను కాలితో తన్నుతూ..
ABN , Publish Date - Feb 16 , 2024 | 12:14 PM
Andhrapradesh: మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతల పట్ల అంబటి రాంబాబు అనుచరులు అనుచితంగా ప్రవర్తించారు. కాలితో తన్నుతూ విరుచుకుపడ్డారు.
పల్నాడు, ఫిబ్రవరి 16: మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతల పట్ల అంబటి రాంబాబు అనుచరులు అనుచితంగా ప్రవర్తించారు. కాలితో తన్నుతూ విరుచుకుపడ్డారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు నిరసనగా శుక్రవారం మంత్రి అంబటి ఇల్లును యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు ముట్టడించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ అంటూ మండిపడ్డారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బైబై జగన్ రెడ్డి, బైబై వైసీపీ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా.. ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై అంబటి అనుచరులు దాడి చేశారు. ప్లకార్డులు చించివేసి కాళ్లతో తన్నారు. పోలీసుల సమక్షంలోనే అంబటి అనుచరులు ఇంతటి అరాచకానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పోలీసులు సైతం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..