Share News

Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టులో జగన్ వాటా ఎంతంటే.. శాసనభసలో బయటపెట్టిన సీఎం

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:15 PM

పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పక్కన పెట్టేసిందో సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా ప్రజల ముందుంచారు. 2019-24 మధ్య వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఏ విధంగా వెనుకపడింది.. ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన అంశాలను సీఎం ప్రస్తావించారు.

Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టులో జగన్ వాటా ఎంతంటే.. శాసనభసలో బయటపెట్టిన సీఎం
YS Jagan

పోలవరం ప్రాజెక్టును 2027కల్లా పూర్తిచేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టేశారన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం 3.5 శాతం మాత్రమే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. దీంతో ఐదేళ్ల కాలంలో జగన్ పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రథమంగా రైతాంగానికి ఎంతో ముఖ్యమైన ఈ ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారించిందనే విషయం శాసనసభలో ప్రభుత్వం చెప్పిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తయితే.. ఏడాదికి సగటున 14.శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 3.5 శాతం పనులు మాత్రమే పూర్తిచేసింది. ఏడాదికి ఒక శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి పనులను కొనసాగిస్తే రెండేళ్ల కాలంలో అంటే 2021కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తై ఉండేదని, జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడమే కాకుండా ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అదొకటంటూ చెప్పుకొచ్చిన వైసీపీ తమ పదవీ కాలంలో కేవలం 3.5 శాతం మాత్రమే పనులను పూర్తి చేసినట్లు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


జగన్ వాటా ఇదే..

పోలవరం ప్రాజెక్టుపై గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులు తాజా ప్రభుత్వ ప్రకటనపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ వాటా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడంలో కేవలం 3.5 శాతం మాత్రమేనట. ప్రస్తుతం 75.5 శాతం ప్రాజెక్టు పనులు పూర్తికాగా.. 72 శాతం పనులు గత టీడీపీ ప్రభుత్వం పూర్తిచేయగా.. జగన్ ప్రభుత్వం వాటా 3.5 శాతం మాత్రమే. మిగిలిన 25 శాతం పనులను రెండేళ్లలో పూర్తిచేస్తామని తద్వారా లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు.


వైసీపీ స్పందన

పోలవరం ప్రాజెక్టు విషయంలో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచడంతో ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. పోలవరంపై లెక్కలు బయటకు రావడంతో వాటిపై ప్రజల్లో చర్చ జరగకుండా ప్రభుత్వంపై బురదజల్లేందుకు వైసీపీ మరో కొత్త నాటకానికి తెరలేపే అవకాశం లేకపోలేదని కూటమి నేతలు అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 20 , 2024 | 04:15 PM