Share News

AP Politics: వైసీపీ ఎంపీల రాజీనామాల వెనుక జగన్ హస్తం ఉందా

ABN , Publish Date - Aug 29 , 2024 | 08:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో కుదుపులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు పూర్తైన మూడు నెలలకే అతి పెద్ద కుదుపు వచ్చి పడింది.

AP Politics: వైసీపీ ఎంపీల రాజీనామాల వెనుక జగన్ హస్తం ఉందా
YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో కుదుపులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు పూర్తైన మూడు నెలలకే అతి పెద్ద కుదుపు వచ్చి పడింది. నమ్ముకున్న వాళ్లే నీతో ఇక సాగలేమంటూ జగన్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పార్టీ వీడుతుంటే తాజాగా రాజ్యసభ సభ్యులు కూడా అదేబాటలో పయనిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ బలహీనపడుతూ వస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో కొందరు నేతలు కూటమి పార్టీల వైపు చూస్తున్నారట. అధికార పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరడం సహజం. కానీ వైసీపీ అధినేత జగన్‌కు విశ్వాసపాత్రులుగా పేరొందిన నాయకులు పార్టీ మారుతున్నారనే ప్రచారం అనేక అనుమనాలకు తావిస్తోంది. వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి పార్టీని వీడుతున్నారా.. లేదంటే జగన్ తన కోవర్టులుగా ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారా అనే చర్చ ఓ వైపు సాగుతోంది.

AP Politics: ఏపీ సర్కార్‌కు డొక్కా రిక్వెస్ట్


పార్టీని వీడిన ఇద్దరు ఎంపీలు..

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన రావు ఇప్పటికే వైసీపీకి, రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మేడా రఘునాథరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, గొల్ల బాబూరావు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతోంది. వీరంతా వైసీపీని వీడి ఏ పార్టీలో చేరతారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. నిజంగానే పార్టీని వీడతారా లేదా ఓ ప్రచారాన్ని బయటకు వదిలారా అనేది తెలియాల్సి ఉంది. పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాత్రం పార్టీ మార్పు వ్యాఖ్యలను ఖండించారు. తాను వైసీపీలోనే ఉంటానని, జగన్‌‌కు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీని వీడిన ఇద్దరు ఎంపీలు కాకుండా మిగతా ఐదుగురు జగన్‌కు బాగా సన్నిహితులు. అలాంటి వ్యక్తులు వైసీపీని వీడటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

MLA Ganta: వైఎస్ జగన్ డైలాగ్‌ను ఆయనకే అప్పజెప్పిన గంటా..


జగన్ ప్రమేయం ఉందా..

వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారా.. లేదా జగన్ ఆదేశాలతో వైసీపీ కోవర్టులుగా పార్టీ మారబోతున్నారా అనే చర్చ ఇప్పటికే మొదలైంది. గతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్‌కు అత్యంత దగ్గరగా ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిరోజులకే హస్తం పార్టీని వదిలి తిరిగి వైసీపీలో చేరారు. రామకృష్ణారెడ్డి ఎందుకు వైసీపీ వీడారు.. మళ్లీ ఎందుకు వచ్చారనే విషయం ఎవరికి అర్థం కాలేదు. జగన్ ఆదేశాలతోనే ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లారనే చర్చ జరిగింది. మధ్యలో ఏమైందో ఏమో కాని రామకృష్ణారెడ్డి మనసు మార్చుకుని.. వైసీపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరతారని ప్రచారం జరుగుతున్న వ్యక్తుల వెనుక జగన్ ఉన్నారా.. లేదంటే వైసీపీపై అసంతృప్తితో పార్టీ మారుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. నాయకుల వ్యవహారశైలి ఆధారంగా ఈ విషయంలో మరికొద్దిరోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Kadambari Jethwani: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో కీలక పరిణామం.. ఈ రాత్రికి హైదరాబాద్‌కు రాక

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 29 , 2024 | 08:36 PM