YS Jagan: హర్యానాపై సరే.. కశ్మీర్ సంగతేంది.. జగన్ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకున్నారా..
ABN , Publish Date - Oct 10 , 2024 | 10:36 AM
జమ్మూ కశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించగా.. హర్యానాలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హర్యానా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాని ఆశించిన కాంగ్రెస్ అంచనాలు తప్పడంతో ఈవీఎంలపై ఆ పార్టీ సీనియర్ నేతలు ..
ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి సామెత సరిగ్గా జగన్‌కు సరిపోతుందనే చర్చ జరుగుతోంది. హర్యానా ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందించిన తీరు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారట. హర్యానాతో పాటు జమ్మూకశ్మీర్‌లోనూ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జమ్మూ కశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధించగా.. హర్యానాలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హర్యానా ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాని ఆశించిన కాంగ్రెస్ అంచనాలు తప్పడంతో ఈవీఎంలపై ఆ పార్టీ సీనియర్ నేతలు అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ప్రజల తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన వేళ.. ప్రతికూలంగా రావడంతో.. ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారనే విషయం ప్రచారంలోకి రాకుండా ఆ పార్టీ నేతలు కొంత జాగ్రత్తపడుతున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రజలు తమను ఎందుకు నమ్మడం లేదనే విషయంపై ఆలోచన చేయకుండా.. ఈవీఎం యంత్రాలపై విమర్శలు చేసి నవ్వులపాలవుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
Ratan Tata: వ్యాపారాల్లో సూపర్ మ్యాన్.. లవ్‌లో ఫెయిల్..
హర్యానా కంటే బీజేపీ జమ్మూకశ్మీర్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈవీఎంలలో తేడా చేసి ఉంటే కశ్మీర్‌లో సైతం బీజేపీ జిమ్మిక్కులు చేసి గెలిచి ఉండాల్సింది కదా అనే చర్చ జరుగుతోంది. హర్యానా ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడంతో కాంగ్రెస్ నిరాశతో ఆరోపణలు చేసి ఉండొచ్చు.. ఆ రాష్ట్ర ఎన్నికలతో సంబంధం లేని జగన్.. నాలుగు నెలల క్రితం జరిగిన ఏపీ ఎన్నికలతో ముడిపెట్టి ఈవీఎంల కారణంగానే తాము ఓడిపోయామని చెప్పడం ద్వారా వైసీపీ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
Ratan Tata : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
ఈవీఎంలపై నిందలు..
ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలు ఎందుకు ఓటు వేయలేదని ఆలోచించకుండా ఈవీఎంలపై నిందలు వేయడం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఆలోచన, ఓటర్ల ఆలోచన భిన్నంగా ఉండొచ్చు. ఈవీఎంలలో తేడా జరిగితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షులు జగన్ పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎలా గెలిచారనే ప్రశ్న తలెత్తుతుంది. జగన్ ఈవీఎంలను మాయ చేసి గెలిచారా.. లేదంటే ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఎలా గెలిచారు. వైసీపీ గెలిచిన 11 ఎమ్మెల్యే స్థానాల్లో ఈవీఎంలను మాయ చేసి గెలిచారా అనే దానికి జగన్ సమాధానం చెప్పకుండా ఈవీఎంలపై నిందలు వేయడం ప్రజాతీర్పును అవమానించడమనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలను ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడి గెలిచిందా అనేదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని, అవ్వన్నీ వదిలేసి కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకు నీచ రాజకీయాలకు పాల్పడితే ప్రజలు క్షమించరని టీడీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా హర్యానా ఫలితాల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగితే కశ్మీర్‌లో కూడా జరిగినట్లేనని జగన్ చెప్పగలరా.. కశ్మీర్ ఫలితాలపై ఆయన ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి దీనిని వైసీపీ ఎలా సమర్థించుకుంటుందో వేచి చూడాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here