YSRCP: సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి అరెస్టు
ABN , Publish Date - Nov 17 , 2024 | 09:14 AM
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ చేసిన న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో సురేష్ రెడ్డిని నరసరావుపేట జైలుకు తరలించారు.
పల్నాడు జిల్లా: గురజాల వైఎస్సార్‌సీపీ (YSRCP) సోషల్ మీడియా (Social Media) కో-ఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి (Suresh Reddy)ని పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. కరీమున్నీసా అనే మహిళపై లైంగిక వేధింపుల కేసులో అతనిని అరెస్టు చేశారు.. బాధితురాలు పిడుగురాళ్ళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఈ మేరకు అరెస్టు చేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి సురేష్ రెడ్డి అనుచరుడిగా ఉన్నాడు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ జరిపిన న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో సురేష్ రెడ్డిని నరసరావుపేట జైలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సోషల్ మీడియా సైకోలను అరెస్టు చేయడంలో పోలీసులు స్పీడ్ పెంచారు. వర్రా రవీంద్రర్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుల వికారాన్ని చూసి పోలీసు యంత్రాంగం సైతం ఆశ్చర్యపోతోంది. వైఎస్ షర్మిలా రెడ్డిపై పెట్టిన పోస్టుల వెనక కుట్రదారుడిగా భావిస్తున్న సజ్జల భార్గవరెడ్డిని సైతం అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
కాగా కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కాలకూట విషం చిమ్మే ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో వర్రాను ఏ1గా పేర్కొనగా... వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్‌చార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డిని రెండో నిందితుడిగా (ఏ2) చేర్చారు. వర్రాతోపాటు... అతడికి సహకరించిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వర్రా వాంగ్మూలం ఆధారంగా అనేక కీలక అంశాలను గుర్తించామని, ఈ వ్యవస్థీకృత నేరంలో భాగస్వాములైన మొత్తం 45 మందిపై కేసు నమోదు చేశామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పులివెందుల కోర్టుకు దీనిని సమర్పించారు. వర్రా రవీంద్రా రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన 40 నీచమైన వ్యాఖ్యల స్ర్కీన్‌షాట్లను కూడా సేకరించామని... అవి తాను పోస్టు చేసినవే అని అతడు అంగీకరించాడని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా పేరుతో జరిగే ‘ఆర్గనైజ్డ్ క్రైమ్’లో వర్రా రవీంద్రా రెడ్డి భాగస్వామిగా ఉంటూ నీచమైన పనులు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో తప్పుడు వార్తలు సృష్టించడం, నీచమైన వ్యాఖ్యలు చేయడం వ్యవస్థీకృతంగా జరుగుతోందన్నారు. ఇందులో... సజ్జల భార్గవ్ రెడ్డితోపాటు సిరిగిరి అర్జున్ రెడ్డి (ఏ3)ది కీలక పాత్ర అని తెలిపారు. ‘‘వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చే కంటెంట్ తీసుకుని చిన్నపిల్లలు, మహిళలపై అసభ్య, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం.. తమకు నచ్చని పార్టీలనేతలపై జుగుప్సాకరమైన మార్ఫింగ్ ఫొటోలు పెట్టడం.. హోంమంత్రి అనిత వ్యక్తిత్వాన్ని హననం చేయడం.. వ్యవస్థలంటే లెక్కలేకుండా రెచ్చిపోవడం వర్రా రవీందర్ రెడ్డి నేర స్వభావం’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు..
ఆదివారం నుంచి గ్రూప్ 3 పరీక్షలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News