Share News

Heart Surgeries : ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:36 AM

ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 9 నుంచి 14 వరకు 33వ పిల్లల ఉచిత గుండె సర్జరీలు నిర్వహించినట్టు చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ సర్వీసెస్‌ అండ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వి.రామారావు తెలిపారు.

 Heart Surgeries : ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌

  • 16 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు

విజయవాడ(ప్రభుత్వాసుపత్రి), డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 9 నుంచి 14 వరకు 33వ పిల్లల ఉచిత గుండె సర్జరీలు నిర్వహించినట్టు చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ సర్వీసెస్‌ అండ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వి.రామారావు తెలిపారు. శనివారం ఆసుపత్రి ఆవరణలో ఆయన మాట్లాడు తూ డాక్టర్‌ నెల్సన్‌ ఒలివర్‌ డేవిడ్‌, పిడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్‌, క్వీన్స్‌ ల్యాండ్స్‌ చిల్ట్రన్స్‌ హాస్సిటల్‌ ఆస్ట్రేలియా డాక్టర్‌ క్రిస్టియన్‌ అలెగ్జాండర్‌ పిడియాట్రిక్‌ కార్టియాక్‌ ఇంటెన్సివిస్ట్‌, స్టువర్ట్‌ హ్యారి, హన్నా ఎలిజబెత్‌, మోర్టాన్‌ తదితరులు క్వీన్స్‌ ల్యాండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ కు వచ్చి హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఆంధ్ర ఆసుపత్రి డాక్టర్‌ నాగేశ్వరరావు, కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ సాయిరామ్‌, పిల్లల కార్డియాక్‌ సర్జన్‌తో కలిసి ఆంధ్ర ఆసుపత్రిలో 16 మంది పిల్లల కు ఉచిత గుండె ఆపరేషన్లు నిర్వహించినట్టు చెప్పారు. పదేళ్ల నుంచి ఇప్పటి వరకు 33సార్లు ఇలాంటి ఆపరేషన్లు చేశామని ఇక ముందు కూడా చేస్తామని, రెండు మూడు నెలలకోసారి ఆసుపత్రికి వచ్చి అదే వైద్యులు ఆపరేషన్లు చేస్తారన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నెలకు 50 నుంచి 60 వరకు.. ఏడాదికి సుమారు 600 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు 4వేల ఆపరేషన్లు పైన, ఇంటర్వెన్షన్స్‌ విజయవంతంగా చేశామన్నారు. చిన్నారుల గుండె ఆపరేషన్లు విజయవంతం కావడానికి ఆంధ్ర ఆసుపత్రి డాక్టర్‌ విక్రమ్‌ ఆధ్వర్యంలో పిడియాట్రిక్‌ కార్డియాలజీ టీం, పిడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ టీమ్స్‌ కృషి కారణమన్నారు. ఆంధ్ర మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఫౌండేషన్‌, వసుధ ఫౌండేషన్‌, మహే్‌షబాబు ఫౌండేషన్‌, ఎన్టీఆర్‌ వైద్య సేవ వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కార్డియాలజీ చీఫ్‌ డాక్టర్‌ శ్రీమన్నారాయణ, పిల్లల కార్డియాలజిస్టులు డాక్టర్‌ విక్రమ్‌, డాక్టర్‌ సాయిరామ్‌, కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ నాగేశ్వరరావు, సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ రమేష్‌, కార్డియాక్‌ ఎనస్టీయనిస్టు డాక్టర్‌ ఉమాశంకర్‌, పిల్లల కార్డియాక్‌ ఇంటెన్సివ్‌వి్‌స్టలు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 04:36 AM