Sri Bharath: పార్టీకి దూరమైన వారు తిరిగి రావాలనుకుంటే ఆదరిస్తాం..
ABN , Publish Date - Mar 29 , 2024 | 01:35 PM
టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ పతాకాన్ని టీడీపీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి శ్రీ భరత్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి, పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ.. తెలుగుదేశం ఎన్టీఅర్ స్థాపించిన పార్టీ కాబట్టి సమ్ థింగ్ స్పెషల్ అన్నారు.
విశాఖ: టీడీపీ (TDP) కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ పతాకాన్ని టీడీపీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి శ్రీ భరత్ (Sri Bharath), జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి (Gandi Babji), పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ.. తెలుగుదేశం ఎన్టీఅర్ స్థాపించిన పార్టీ కాబట్టి సమ్ థింగ్ స్పెషల్ అన్నారు. జనసేన (Janasena), బీజేపీ (BJP)లతో కలిసి ఒక సదాశయంతో ఎన్నికల్లోకి వెళుతున్నామన్నారు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని ప్రజలు తెలుసుకోవాలని శ్రీ భరత్ అన్నారు. దారి తప్పి పార్టీకి దూరమైన వారు తిరిగి చేరాలనుకుంటే ఆదరిస్తామని తెలిపారు.
Vasantha Krishna Prasad: పేదల పక్షపాతి ఎన్టీఆర్
జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. క్రమశిక్షణకు, నిబద్దతకు పెట్టింది పేరైన టీడీపీలో ఉండటం మనకు గర్వకారణమన్నారు. ఏపీ లో రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను సీఎంను చేయాలని గండి బాబ్జీ పిలుపునిచ్చారు.
Kanakamedala Ravindra Kumar: టీడీపీ కేంద్రంలో కీలకపాత్ర పోషించడం ఖాయం
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.