Home » Nandamuri Taraka Rama Rao
విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందని సినీ నటి జయప్రద చెప్పారు. విజయవాడ అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని ప్రేమని ఆమె చెప్పారు. నటనకే నటన నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని జయప్రద కొనియాడారు.
తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండే పేరు "ఎన్టీఆర్" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సినిమాల్లో ఎన్టీఆర్ అనేక పాత్రలు పోషించి మెప్పించారని చంద్రబాబు కొనియాడారు. రాముడు, కృష్ణుడు వంటి అనేక పాత్రలు పోషించి తెలుగువారు పూజించే స్థాయికి ఆయన ఎదిగారని చెప్పారు.
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు విజయవాడ వేదిక కానుందని టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ చెప్పారు. నగరంలోని మురళీ రిసార్ట్స్‌లో శుక్రవారం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జనార్దన్ వెల్లడించారు.
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండ్ అని కొనియాడారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణతో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.
NTR 101 Birth Anniversary: దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు.
తెలుగు ప్రజల ఆత్మబంధువు అన్న ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయన్నారు.
టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ పతాకాన్ని టీడీపీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి శ్రీ భరత్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి, పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ.. తెలుగుదేశం ఎన్టీఅర్ స్థాపించిన పార్టీ కాబట్టి సమ్ థింగ్ స్పెషల్ అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.