AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?
ABN , Publish Date - Mar 18 , 2024 | 01:40 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేట సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని.. కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కినిపిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతలకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిలకలూరిపేట ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులే బాధ్యత వహించాలని.. కొందరు అధికారుల తీరు చూస్తుంటే ఇది కుట్రగా కినిపిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. మోదీ సభలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రతలకు సంబంధించిన అంశాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దేశ ప్రధానమంత్రి హాజరయ్యే సభకు బ్లాంక్ పాస్లు ఇచ్చారని, ఎవరికి జారీ చేస్తున్నారో కనీసం వాళ్ల పేర్లు లేకుండా పాస్లు ఇవ్వడంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఈసీకి జనసేన ఫిర్యాదు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలో భద్రతా వైఫల్యాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల సభకు అనుమతి తీసుకున్నప్పటికీ భద్రత విషయంలో అధికారులు సరైన రీతిలో స్పందించలేదన్నారు. అధికారుల తీరుపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పవన్ సంకల్పం అదే..
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృష్టి చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తుల విషయంలోనూ ఆయన పడిన శ్రమ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కేవలం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పవన్ కళ్యాణ్ పరితపిస్తున్నారని చెప్పారు. పొత్తుల విషయంలో కొంతమంది జనసైనికులను తప్పుపట్టించే విధంగా సోషల్ మీడియా పోస్టులు పెడున్నారని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీట్ల కంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే పొత్తు కుదుర్చుకున్నామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..