AP NEWS: యూట్యూబ్ చూసి దొంగతనం.. చివరకు ఏమైందంటే..
ABN , Publish Date - Dec 13 , 2024 | 08:43 AM
మేనత్త కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు ఓ వ్యక్తి. అతను అనుకున్నదే తడవుగా యూట్యూబ్‌లో దొంగతనం చేశాడు. జాగిలాలు పట్టుకోకుండా చాకచాక్యంగా ప్లాన్ చేశాడు.
కడప: యూట్యూబ్ చూసి దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రొద్దుటూరులో జరిగింది. పొలం గొడవలతో మేనత్త గంగమ్మతో అల్లుడు మనోహర్ వినోద్‌కి గొడవ జరిగింది. దీంతో అత్త ఇంటికే కన్నం వేశాడు ప్రబుద్ధుడు. తన ఇంట్లో నగలు పోయిన విషయం గమనించిన ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మేనత్త కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నించాడు. అనుకున్నదే తడవుగా దొంగతనం చేస్తే పట్టుబడకుండా ఉండేందుకు తన దగ్గర ఉన్న మొబైల్ సహాయంతో యూట్యూబ్‌లో కొన్ని వీడియోలను చూసి దాని ప్రకారం దొంగతన్నానికి ప్లాన్ చేశాడు. కారప్పొడి చల్లే పద్ధతి ప్రకారం దొంగతనం చేయాలని అనుకున్నాడు. దాని ప్రకారం ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత కారంపొడిని చల్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు మేనత్త ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దొంగతనం బయటపడటంతో మనోహర్ వినోద్ ఇప్పుడు ఊసలు లెక్కపెడుతున్నాడు. ఈ కేసు వివరాలను సీఐ బాలమద్దిలేటి, ఎస్.ఐ మహమ్మద్ రఫీ మీడియాకు వెల్లడించారు.
ఈ క్రమంలో మేనత్తతో మంచిగా మాట్లాడుతూనే అన్ని విషయాలు తెలుసుకున్నాడు. నవంబర్ 9వ తేదీన బెంగళూరు వెళ్తున్నామని మేనత్త చెప్పడంతో దొంగతనం చేయాలని అనుకున్నాడు. డిసెంబర్ 10వ తేదీన రూ.4.60 లక్షల విలువైన 15.5 తులాల బంగారు ఆభరణాలు, పాసుపుస్తకాలు దొంగలించి ఇళ్లంతా కారంపొడి చల్లి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఈ నెల12న ఉదయం ఇంటికి చేరుకున్న మునెయ్య కుటుంబం తమ ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందడంతో వెంటనే పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అల్లుడు మనోహర్ వినోద్ దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్దారించారు. ఆ తర్వాత అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ప్రొద్దుటూరు-మైదుకూరు రోడ్డులో నిన్న (గురువారం) నిందితుడు మనోహర్ వినోద్‌ను అరెస్టు చేశారు. యూట్యూబ్ చూసి తాను దొంగతనానికి పాల్పడ్డానని చెప్పడంతో పోలీసులు షాకింగ్‌కు గురయ్యారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు రికవరీ చేసుకుని రిమాండుకు తరలించారు.
అయితే ప్రొద్దుటూరులోని నంగనూరుపల్లెకు చెందిన మునెయ్య - గంగమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. వీళ్లిద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. మునెయ్య ఆర్టీసీలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. గంగమ్మకు వేముల మండలం రాచకుంటపల్లెకు చెందిన సొంత అన్న కుమారుడే మనోహర్ వినోద్. కొన్ని కారణాలతో మనోహర్ భారీగా అప్పు చేసి వాటిని తీర్చలేక పొలం అమ్మాలని అనుకున్నాడు. పొలం విషయంలో అన్నాచెల్లెల కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో అప్పుల బాధతో మనోహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన తండ్రి మరణానికి మేనత్త గంగమ్మే కారణమని మనోహర్ వినోద్ కోపం పెంచుకున్నాడు. మేనత్త కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు వారి ఇంట్లో చోరీ చేయాలని, అయితే దొంగతనం చేసిన పట్టుబడకుండా ఉండేందుకు యూట్యూబ్‌ను ఫాలో అయ్యాడు. ఇంట్లో కారం జల్లితే పోలీసు జాగిలాలు తనను పట్టుకోలేవని భావించిన మనోహర్ వినోద్ తన ప్లాన్ చేసుకున్నట్లుగానే దొంగతనానికి పాల్పడ్డాడు.
Also Read:
మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..
మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..
For More Telangana News and Telugu News..