YS Viveka: వైఎస్ ఫ్యామిలీలో ఊహించని పరిణామం.. రాజకీయాల్లోకి వివేకా ఫ్యామిలీ!
ABN , Publish Date - Mar 08 , 2024 | 01:29 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన ఈసారి కడప జిల్లాలో ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయిన ఈ అంశం.. ఈ ఎన్నికల్లో మైనస్ కానుంది. వైఎస్ వివేకా కుటుంబం రాజకీయాల్లోకి వస్తోందంటూ కొద్ది రోజులుగా ఏపీలో ప్రచారం జరుగుతోంది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) దారుణ హత్య ఘటన ఈసారి కడప (Kadapa) జిల్లాలో ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ (YCP)కి ప్లస్ అయిన ఈ అంశం.. ఈ ఎన్నికల్లో మైనస్ కానుంది. వైఎస్ వివేకా కుటుంబం రాజకీయాల్లోకి వస్తోందంటూ కొద్ది రోజులుగా ఏపీ (AP)లో ప్రచారం జరుగుతోంది. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ (Sowbhagyamma) కడప ఎంపీ లేదంటే పులివెందుల నుంచి పోటీ చేయాలనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు టాక్. వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలించాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కొందరు అధిష్ఠానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే జరిగితే వైఎస్ ఫ్యామిలీలో ఊహించని పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Yanamala Ramakrishnudu: సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకేం చెప్తారు?
అయితే వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా ఈ నెల15న కడపలో ఆత్మీయ సమావేశాన్ని సునీతా రెడ్డి కుటుంబం నిర్వహించనుంది. తన కుటుంబ సభ్యులు రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఈ సమావేశంలోఅభిమానులతో సునీతా రెడ్డి చర్చించనున్నారని తెలుస్తోంది. సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ బరిలోకి దింపే ఆలోచనపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ కుటుంబం రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు.. కారణాలను పులివెందుల, కడప జిల్లా ప్రజలకు తెలియచేసేందుకే ఆత్మీయ సమావేశమని తెలుస్తోంది.
Palle Raghunath Reddy: ఒక్కరాజధాని కట్టలేని దద్దమ్మ.. 3 రాజధానులు కడతానంటే నమ్ముతారా?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.