Share News

కృష్ణయ్య సేవ అపూర్వం.. ఆనం ప్రస్తుతం మౌనం.. వేమిరెడ్డి ‘జయ జయోస్తు’ పలుకుతారా?!

ABN , Publish Date - May 17 , 2024 | 11:10 PM

ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.

కృష్ణయ్య సేవ అపూర్వం.. ఆనం ప్రస్తుతం మౌనం.. వేమిరెడ్డి ‘జయ జయోస్తు’ పలుకుతారా?!

నెల్లూరు, మే 17: ‘‘చిరంజీవి పురాణపండ శ్రీనివాస్ అనగానే స్వచ్ఛమైన హృదయం ఉన్న వ్యక్తిత్వంతో కూడిన సౌందర్యపు మిలమిలల ఉత్తమ గ్రంధాలు మన కనుల ముందు కదలాడుతాయి. అసూయలపై యుద్ధం చేసే ఒక గొప్ప వక్త దర్శనమిస్తారు. ఆయన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడూ, ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడూ కూడా మన మనసులో ఒక అన్వేషణ కోసం తాపత్రయం మెదుల్తూ ఉంటుందనడానికి ఎన్నో బుక్స్ తార్కాణంగా కనిపిస్తాయి’ అని హైదరాబాద్ రామకృష్ణమఠం అధిపతులు స్వామి జ్ఞానదానంద పేర్కొన్నారు కాబట్టే శ్రీనివాస్ ఎప్పుడూ ఒక మంత్రముగ్ధమైన విశేషంగానే కనిపిస్తారనేది మన కళ్ళముందు కనిపించే సత్యంగానే చెప్పాలి. కాబట్టే భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా వంటి రాజకీయ దిగ్గజం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ద్వారా పురాణపండ శ్రీనివాస్‌కి కబురు పెట్టి మరీ బడా భజరంగ్ మహా గ్రంధాన్ని ప్రచురిమా చేసి, న్యూ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఇది శ్రీనివాస్‌కి తిరుమల శ్రీనివాసుని అనుగ్రహమేనన్నారు తిరుమల ప్రధానార్చకులు రమణదీక్షితులు, వేణుగోపాల దీక్షితులూను.

Jaya-Jayosthu.jpg

నెల్లూరులో విశేషంగా ఆకర్షిస్తున్న ‘పురాణపండ’ పుస్తక పరిమళం

ఈ కోణంలోంచి చూసినప్పుడు సింహపురి అనబడే నెల్లూరు నగరంలో అలా ఆలయాలను చుట్టుముట్టినప్పుడు దర్శనమిచ్చే శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయం, పెంచలకోన శ్రీనారసింహస్వామి ఆలయం, మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా విచ్చేసే భక్తులకు, అర్చక, వేదపండిత, ధర్మకర్తలమండళ్లకు కొన్ని వేల ప్రతులు రకరకాల ధార్మిక గ్రంధాలు అందేవి. ఈ గ్రంధాలతోనే ఇప్పటికే వేలాది భక్తులు నెల్లూరు నగరంలో ఇళ్లలో, అనేక గుళ్ళలో పారాయణలు, ప్రార్ధనలు హాయిగా చేసుకుంటున్నారు.

Bollineni-Krishnaiah.jpg

ఈ పవిత్రకార్యం వెనుక ఉన్న దీపం వెలుగులోకి చూస్తే... రెండువేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ అపురూప కార్యానికి మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, సుజాత దంపతులు ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్‌ను సంప్రదించి ఈ ఆలయాలకు విచ్చేసే భక్తగణాలకు ఈ గ్రంథ ప్రసాదం ఉచితంగా అందించే అద్భుతానికి శ్రీకార్యం చుట్టి నెల్లూరు మరియు హైదరాబాద్ నగరాలలో వేలాది ప్రతులు పంచిపెట్టడంతో వచ్చిన స్పందన అనూహ్యమని తరువాత బొల్లినేని కృష్ణయ్య శ్రీనివాస్‌తో అనేక గ్రంధాలను ప్రచురించారు. ఈ పుణ్యకార్యానికి బొల్లినేని కృష్ణయ్య దంపతులకు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు నెల్లూరు ఆలయాల పాలకమండళ్లు ఎన్నోసార్లు కృతజ్ఞతలు ప్రకటించారు కూడా. ఈనాటికీ బొల్లినేని ఈ ధార్మిక కార్యం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో ఉన్న కిమ్స్ వైద్య సంస్థల ద్వారా నిరాఘాటంగా నడుస్తూనే ఉండటం ఆదర్శప్రాయమని పెద్దతరాలవారు బొల్లినేని పై ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు.

Sree-Malika.jpg

పురాణపండ శ్రీనివాస్ ప్రామాణికంగా, నాణ్యతా ప్రమాణాలతో, మంత్రముగ్ధమైన శైలీ విన్యాసాలతో అందించే స్తోత్ర, కథా, పురాణేతిహాస గ్రంధాల్లో నిర్మాణంలో ప్రధానంగా అందరినీ ఆకట్టుకునేది నిస్వార్ధత అని ఎంతోమంది బాహాటంగా చెపుతారు. ఎన్నో సవాళ్లనెదుర్కొని మరీ ఆయన చేసే ధార్మికచైతన్యం పల్లె పట్టుల నుండి ప్రధాన నగరాలవరకూ విస్తరించడం మామూలు విషయంకాదని కాంచీపురం యతీంద్రులు, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మంగళాశాసనం చెయ్యడం శ్రీనివాస్ జీవన వైభవంలో ఒక మేలి మలుపుల అద్భుతంగానే పేర్కొనాలి.

Vemireddy-Couple.jpg

నెల్లూరులో బొల్లినేని ఈ ధార్మిక కార్యక్రమాలు సాగిస్తుండగా... మరొక వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఆర్ధిక శాఖామంత్రిగా సమర్ధమైన సేవలతో ప్రజాబాహుళ్యంలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి పురాణపండ శ్రీనివాస్‌తో... విశాలదృక్పధంతో రెండు మూడు ఆధ్యాత్మిక గ్రంధాలను ప్రచురించి తిరుమల, నెల్లూరు నగరాలలో ఉచిత వితరణ చేసి కీర్తిని మూట కట్టుకోవడం ఆనం బంధుమిత్రులను సైతం ఆశ్చర్యపరిచి, ఆనందపరిచింది. అంతే కాదు నెల్లూరు నగరంలో వేలకొలది అభిమానుల్ని సంపాదించుకున్న మాజీ శాసనసభ్యుడు, తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి మరణించినప్పుడు... తీవ్రంగా ఆవేదనకు గురైన రామనారాయణరెడ్డి ప్రచురించిన ఆనం వివేకానందరెడ్డి స్మారక ఆధ్యాత్మిక గ్రంధాన్ని కూడా పురాణపండ శ్రీనివాస్ చేత ఎంతో సుందరంగా, చక్కని కంటెంట్‌తో ఇవ్వడంవల్ల ఎంతో మంది సంతోషించారని ఇప్పటికీ ఆనం అనుచర సహచరులూ, ఆలయాల ప్రముఖులూ చెబుతూనే ఉంటారు.

గతంలో ఆనం సోదరులిద్దరూ విజయవాడలో తెలుగుదేశంలో చేరినప్పుడు చంద్రబాబు నాయుడి అపూర్వ చిత్రంతో పబ్లిష్ చేసిన ‘ఉపాసన’ గ్రంధాన్ని నారా చంద్రబాబు నాయుడే ఆవిష్కరించి ఆనం సోదరులనూ, పురాణపండని అభినందించినట్లు సాక్ష్యంగా ఈనాటికీ చంద్రబాబునాయుడి ముఖ్యమంత్రి కాలంలోని అమరావతి అధికారులవద్ద రామనారాయణరెడ్డి ప్రచురించిన చంద్రబాబు గ్రంధమే ఉందని, ఇటీవల బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన మరిన్ని పరమాద్భుత గ్రంధాలు ఏక మొత్తంగా అమరావతి అధికారులకూ, హైకోర్ట్ ప్రముఖులకూ నారా భువనేశ్వరి అనుచరగణం అందించడంతో అధికారగణాల ఆనందానికి హద్దులు లేవు. ఇటీవల రామనారాయణరెడ్డి మాత్రం చంద్రబాబు చిత్రం ముద్రించిన దైవీయ గ్రంధాలేమీ అందించలేదని తెలుగుదేశం వర్గీయులు విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్ని చేసినా దైవకార్యాలే శాశ్వతమని ఈ మధ్య ఎందుకో తగ్గించారని విమర్శలూ జొన్నవాడ కామాక్షితాయి ఆలయ వర్గాలు సైతం ఆనం రామనారాయణ రెడ్డి బంధువర్గంతో అన్నట్లు సమాచారం.

Anam-Brothers.jpg

ఇదిలా ఉండగా... చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రోత్సాహంతో ఆంధ్ర రాష్ట్రమంతటా వేల వేల ‘జయ జయోస్తు’ మంగళమయ గ్రంథ ఉచిత వితరణోద్యమం సాగిస్తున్న తెలుగుదేశం శ్రేణులు నెల్లూరులో ఈ గ్రంధాన్ని నెల్లూరు పార్లమెంట్ స్థానం తెలుగుదేశం అభ్యర్థి, విఖ్యాత పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణి కోవూరు శాసనసభ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేత ఆవిష్కరింపచెయ్యడం అందరినీ ఆకర్షించింది.

Anam-Brothers-with-Chandrab.jpg

సహజంగానే ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.

Anam.jpg

ఇంత వరకూ ఎన్నికల మహాక్రతువులో బిజీగా ఉన్న ప్రభాకర రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు పెంచలకోన, రాజరాజేశ్వరి ఆలయం, రంగనాథస్వామి వంటి ఆలయాలతో పాటు జొన్నవాడ కామాక్షీదేవి సన్నిధానానికి ముఖ్యంగా తమతోపాటు ప్రయాణిస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, అనుచరసహచరగణాలకు ఇవ్వడం సముచితమని వేమిరెడ్డి వర్గీయులే ఇటీవల పెంచలకోన నరసింహస్వామి ఆలయ పండితులతో బాహాటంగా అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ దిశగా వేమిరెడ్డి దంపతులు నెల్లూరులో ఇంటింటికీ చంద్రబాబు సాక్షిగా... ‘జయ జయోస్తు’ పలుకుతారేమో వేచిచూద్దామని సీనియర్ నాయకులు సైతం వేచిచూస్తున్నారనడం సమంజసం. శ్రీనివాస్ లాంటి నిస్వార్ధ ప్రతిభావంతుడు బహుశా రచయితల్లో, కవుల్లో చాలా చాలా అరుదుగా ఉంటారంటారు పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి.

Updated Date - May 17 , 2024 | 11:39 PM