TG Bharath: చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి 30ఏళ్లు..
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:01 PM
Andhrapradesh: పోరాట యోధుడు , నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు అని మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రం కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు మొదటి సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి 30 ఏళ్లు అవుతోందని తెలిపారు. చంద్రబాబు ఐడియాలజీతో ఆయనను సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిలిచేవాళ్లన్నారు.
అమరావతి, ఆగస్టు 30: పోరాట యోధుడు , నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు అని మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రం కోసం చంద్రబాబు (CM Chandrababu Naidu) నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు మొదటి సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసి 30 ఏళ్లు అవుతోందని తెలిపారు. చంద్రబాబు ఐడియాలజీతో ఆయనను సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పిలిచేవాళ్లన్నారు. చంద్రబాబు విధానాలను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. కొత్త విధానాలను అమలు కావాలంటే బాబు నిర్ణయంతోనే అవుతుందన్నారు. చంద్రబాబు నేటి తరానికి దార్శనీయులని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
Ayyannapatrudu: అటవీ అధికారులకు స్పీకర్ అయ్యన్న సవాల్.. రాజీనామాకు సిద్ధమంటూ
చంద్రబాబుకు, జగన్‌కు చాలా తేడా: ఎమ్మెల్యే వసంత
అత్యధిక కాలం సీఎంగా రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కష్టపడ్డారని... కష్టపడుతునే ఉన్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు చాలా తేడా ఉందని తెలిపారు. తప్పు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్దే చంద్రబాబు ధ్యేయమన్నారు. చంద్రబాబు సాధించిన ఘనతలు చాలా గొప్పవి అని వెల్లడించారు. చంద్రబాబు సహనం, కష్టం, విజన్ కలిగి ఉన్నారన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబే అని అన్నారు. కష్టకాలంలో సహనం వ్యక్తం చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబుపై నమ్మకంతోనే ప్రజలు మళ్లీ పట్టం కట్టారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. .
ఇవి కూడా చదవండి..
CM Chandrababu: కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై చంద్రబాబు, లోకేష్ సీరియస్.. విచారణకు ఆదేశాలు
Lokesh: ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలపై లోకేష్ స్పందన
Read Latest AP News And Telugu News