Share News

AP Government: పత్తి రైతుకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..

ABN , Publish Date - Aug 28 , 2024 | 07:52 PM

రాష్ట్రంలో పత్తి రైతులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రాష్ట్రంలో పండించే పత్తి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు.

AP Government: పత్తి రైతుకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
Minsiters Savita and Atchannaidu

రాష్ట్రంలో పత్తి రైతులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రాష్ట్రంలో పండించే పత్తి పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత తెలిపారు. ముఖ్యంగా పత్తిలో ప్లాస్టిక్‌తో పాటు ఇతర వ్యర్థాల కారణంగా రైతుకు ధర రావడం లేదన్నారు. పత్తిలో వ్యర్థాల తొలగింపుతోనే అధిక ధర వస్తుందన్నారు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి సవిత సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా రైతులను చైతన్యం చేయాలన్నారు. పత్తి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటుందని తెలిపారు.

AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను


ప్రత్యేక సమావేశం..

అమరావతిలోని సచివాలయంలో పత్తిలో వ్యర్థాల తొలగింపు, రైతులకు అధిక ధర లభ్యంపై జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లరు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయం విద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత సమావేశమయ్యారు. పత్తిలో వ్యర్థాల వల్ల ధర తగ్గుముఖంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి కె.సునీత పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2017-18లో 20.50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరగ్గా, 2023-24లో 11.58 లక్షల బేళ్ల ఉత్పత్తికి తగ్గిపోయిందన్నారు. ప్లాస్టిక్, గోనె సంచుల్లో పత్తిని ప్యాకింగ్ చేయడం వల్ల జిన్నింగ్ సమయంలో వ్యర్థాలు బయటపడుతున్నాయన్నారు. దీనివల్ల పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు ధర కూడా తగ్గుతోందన్నారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి తెలిపారు. పత్తి సేకరణ సమయంలో కాటన్ సంచులు వాడకం వల్ల ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పడే అవకాశం ఉండదన్నారు. దీనికి వ్యవసాయశాఖాధికారులు రైతుల్లో అవగాహన కల్పించాలని మంత్రి సవిత సూచించారు.

JC Asmith Reddy: కొందరు పోలీసుల తీరులో మార్పు రాలేదు..


ఈ క్రాప్‌తో మేలు..

ఈ క్రాప్ లో తప్పనిసరిగా పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ క్రాఫ్‌లో నమోదు చేసిన పంటను కొనుగోలు చేయాలని సీసీఐ ప్రతినిధులకు మంత్రి స్పష్టంచేశారు. అదే సమయంలో ఈ క్రాప్ లో నమోదు వల్ల ప్రభుత్వం అందించే ఫలాలతో లబ్ది పొందొచ్చుననే విషయంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అంతిమంగా రైతులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే పత్తిని కొనుగోలు చేయబోమని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. అంతిమంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జ్యూట్ సంచులు, కాటన్ సంచులు వినియోగంలోకి తీసుకురావాలని, రైతులను చైతన్యం చేసేందుకు అధికారులు, జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు, సీసీఐ ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రైతుల దగ్గర పంట కొనుగోలు చేస్తే జన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లకు సెస్ మినహాయింపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 28 , 2024 | 07:52 PM