Share News

Holidays: దసరా సెలవులు ప్రకటించిన సర్కార్

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:56 AM

Andhrapradesh: ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3 (గురువారం) నుంచి 13వ (ఆదివారం) తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Holidays: దసరా సెలవులు ప్రకటించిన సర్కార్
AP Government announced Dussehra holidays

అమరావతి, అక్టోబర్ 1: దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 12వ తేదీన దసరా పండుగ రానుంది. ఈ క్రమంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3 (గురువారం) నుంచి 13వ (ఆదివారం) తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ


తిరిగి ఈనెల 14వ (సోమవారం) తేదీన స్కూళ్లు పున: ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు ఈ నిర్ణయం వర్తించనుంది. మరోవైపు అక్టోబర్ 3 నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ఉత్సవాలు ముగియనున్నాయి. తొమ్మిరోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

holiday-ap.jpg

Tirumala: తిరుమలలో దర్శనం రోజే రూ.300 టికెట్లు పొందడం ఎలా..


తెలంగాణలో సెలవులు ఇలా...

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులను ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ప్రకటించేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 15వ తేదీ నుంచి యధావిధంగా స్కూల్స్ ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే 2024వ సంవత్సరంలో దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. దీనికి ముందు బతుకమ్మ సంబరాలు తొమ్మిరోజుల పాటు కొనసాగనున్నాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2వ తేదీన చేస్తారు. ఆ తరువాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. అంటే దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు చేసుకోనున్నారు.


ఇవి కూడా చదవండి...

Gold and Silver Rates: బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Viral: అచేతనంగా పుట్టిన శిశువును ఈ డాక్టర్ ఎలా బతికించారో చూస్తే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 12:05 PM