Share News

YS Sharmila: మీకు ఓట్లేసింది ఇందుకేనా.. జగన్‌‌ను ఏకిపారేసిన షర్మిల

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:05 PM

Andhrapradesh: ‘‘1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదని గుర్తుచేశారు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ’’ అంటూ జగన్‌పై షర్మిల ఫైర్ అయ్యారు.

YS Sharmila: మీకు ఓట్లేసింది ఇందుకేనా.. జగన్‌‌ను ఏకిపారేసిన షర్మిల
APCC Chief YS Sharmila Reddy

విజయవాడ, నవంబర్ 11: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan)ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఫైర్ అయ్యారు. జగన్ అసెంబ్లీకి గైర్హాజరవడం పట్ల షర్మిల విరుచుకుపడ్డారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అంటూ సెటైర్ విసిరారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని అన్నారు. ‘‘మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే... ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం’’ అని చెప్పుకొచ్చారు.

CM Chandrababu: ‘సూపర్‌ సిక్స్‌’కు ఊతం!


కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని విమర్శించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. మహిళలపై దాడులు ఆగడం లేదని... ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని వ్యాఖ్యలు చేశారు. బెల్టు షాపుల దందాను అరికట్టలేదని... ఐదు నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదన్నారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే... ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలన్న ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమన్నారు.

Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ


1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదని గుర్తుచేశారు. ‘‘మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభాపక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి’’ అంటూ హితవుపలికారు.


ఇవి కూడా చదవండి...

Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!

AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 12:07 PM