Share News

AP Govt: త్వరలోనే పున:ప్రారంభంకానున్న అశోక్ లేలాండ్...

ABN , Publish Date - Aug 17 , 2024 | 09:17 AM

Andhrapradesh: మల్లవల్లి పారిశ్రామిక పార్కులో అశోక్ లేలాండ్ పునఃప్రారంభం కానుంది. అశోక్ లేలాండ్‌ను మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 17 వ తేదిన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అశోక్ లేలాండ్ ప్రతినిధులతో గన్నవరం ఎంఎల్ఏ యార్లగడ్డ వెంకట రావు పలుమార్లు చర్చలు జరిపారు. 75 ఎకరాల్లో 130 కోట్లు రూపాయలతో బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకానుంది.

AP Govt:  త్వరలోనే పున:ప్రారంభంకానున్న అశోక్ లేలాండ్...
Ashok Leyland to relaunch soon

అమరావతి, ఆగస్టు 17: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. వైసీపీ పాలనలో అనేక కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసింది. ప్రభుత్వ సహకారం అందకపోవడంతో పలుకంపెనీలు ఏపీకి టాటా చెప్పేసి పక్క రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయి. అంతేకాకుండా సగంపైగా పూర్తిన కంపెనీలు కూడా రాష్ట్ర సహకారం దక్కక మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీని వీడిన, మధ్యలోనే పనులు నిలిచిపోయిన కంపెనీలపై ప్రధానంగా దృష్టించింది. అందులో భాగంగా అశోక్‌ లేలైలాండ్ (Ashok Leyland) పున:ప్రారంభం.

Telangana: అర్థరాత్రి దాడి.. హరీష్ రావు కన్నెర్ర..!


మల్లవల్లి పారిశ్రామిక పార్కులో అశోక్ లేలాండ్ పునఃప్రారంభం కానుంది. అశోక్ లేలాండ్‌ను మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సెప్టెంబర్ 17 వ తేదిన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో (CM Chandrababu Naidu) అశోక్ లేలాండ్ ప్రతినిధులతో గన్నవరం ఎంఎల్ఏ యార్లగడ్డ వెంకట రావు (MLA Yarlagadda Venkatrao) పలుమార్లు చర్చలు జరిపారు. 75 ఎకరాల్లో 130 కోట్లు రూపాయలతో బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకానుంది. దేశంలో మొదటి సారిగా మల్లవల్లి పారిశ్రామిక వాడలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను అశోక్ లేలాండ్ ఏర్పాటు చేసింది.

Current Bill Payments: మళ్లీ గూగుల్‌/ఫోన్‌పేలతో కరెంట్‌ బిల్లుల చెల్లింపు


2014 నుంచి 2019 వరకు 75 శాతం పనులను సంస్థ పూర్తి చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ సహకారం కొరవడటంతో అశోక్ లేలాండ్ పనులు నిలిపివేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ యూనిట్ పనులు నిలిపివేసిన విషయాన్ని చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో అశోక్ లేలాండ్ ప్రతినిధులతో నిన్న (శుక్రవారం) ఎమ్మెల్యే చర్చలు నిర్వహించారు. మిగిలిన 25 శాతం పనులను నెలరోజుల్లో పూర్తి చేస్తామని ఈ సంద్భంగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. దీంతో మరో నెలరోజుల్లోనే అన్ని పనులు పూర్తి చేసుకుని అశోక్ లేలాండ్ అందుబాటులోకి రానుంది.


ఇవి కూడా చదవండి...

నన్ను తిట్టింది ఎవరు?

AP Politics: జగన్‌‌ను అరెస్ట్ భయం వెంటాడుతోందా..!

Read Latest AP News And Telangana News

Updated Date - Aug 17 , 2024 | 09:41 AM