Share News

TDP: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు

ABN , Publish Date - May 17 , 2024 | 11:06 AM

అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖలో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.

TDP: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తేనే దాడులు ఆగుతాయి: చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ (Polling) అనంతరం వైసీపీ (YCP) రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖ (Visakha)లో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి టీడీపీ (TDP)కి ఓటు వేశారనే కారణంతో నలుగురిపై వైసీపీ మూకలు దాడులు చేశారని మహిళలపై కూడా పాశివికంగా దాడికి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. ఈ దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంవల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.


పల్నాడు (Palnadu)లో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వైసీపీ రౌడీ మూకల ఇళ్లల్లో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు (Police) పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాచర్లలో మారణ హోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (Pinnelli Ramakrishna Reddy)పై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప దాడులు ఆగే పరిస్థితి లేదని అన్నారు.


విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన పోలీస్ అధికారులను బదిలీ చేయడమే కాకుండా.. వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పల్నాడు జిల్లా: సర్పంచ్ ఇంటిపై వైసీపీ దాడి..

పవన్ కళ్యాణ్ గెలుపుపై కోట్లలో బెట్టింగ్

బయటపడిన జగన్ నిజస్వరూం..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం దృశ్యాలు..

‘ఇండీ’ కూటమికి ప్రధాని సవాల్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 17 , 2024 | 11:06 AM