AP Politics: నెల రోజులు కాకుండానే ఎదురుదాడి.. వైసీపీ నేతలకు ఏమైంది..?
ABN , Publish Date - Jul 03 , 2024 | 11:07 AM
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కాలేదు. తక్కువ కాలంలోనే ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం సామాజిక భద్రత ఫించన్లను పెంచింది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కాలేదు. తక్కువ కాలంలోనే ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం సామాజిక భద్రత ఫించన్లను పెంచింది. దీంతో 60 లక్షల మందికి పైగా ప్రజల కళ్ళల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆనందాన్ని నింపింది. మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. డీఎస్సీ అభ్యర్థుల కోరిక మేరకు టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేసింది. రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు కొత్త ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తన పాలనా అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు నిధుల కొరత ఉన్నప్పటికీ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనను గాడిలో పెట్టేందుకు తీవ్రంగానే శ్రమించాల్సి వస్తోంది. సాధారణంగా ఎవరైనా కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత పాలన గాడిలో పడేందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలు ఇతర ప్రజాసమస్యలపై ప్రశ్నించేందుకు విపక్షాలు కూడా అధికారపక్షానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకువండానే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నా.. ఏమి చేయడం లేదు.. హామీల అమలులో విఫలమైందంటూ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో వైసీపీ నాయకులకు రాజకీయ పరిపక్వత లేదనే ప్రచారం జరుగుతోంది.
CM Chandrababu: అమరావతి రాజధానిపై నేడు శ్వేతపత్రం విడుదల
తప్పుడు ప్రచారం..!
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదంటూ వైసీపీ నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాలేదు. మరోవైపు వైసీపీ పాలనపై విసుగుచెంది.. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. సుదీర్ఘ పాలనా అనుభవం ఉండటంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజల మనసును మార్చేందుకు.. ఓటర్లలో లేనిపోని అపోహలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సచివాలయ సిబ్బందితో ఒకరోజు వ్యవధిలో దాదాపు 90శాతం పెన్షన్లు పంపిణీ చేశారు. అయినప్పటికీ పెన్షన్లు సరిగ్గా పంపిణీ చేయలేదని.. సచివాలయాలకు పిలిపించి పెన్షన్లు ఇచ్చారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి స్థానికంగా నివాసం లేకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు పెన్షన్ తీసుకోవడానికి తమ పెన్షన్ ఉన్న సచివాలయం పరిధిలోకి వస్తుంటారు. ఆ సందర్భంగా కేవలం వారంతా సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకుని వెళ్తుంటారు. గత ప్రభుత్వంలోనూ అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని చూపించి ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేకపోయారంటూ అవాస్తవ ప్రచారాన్ని వైసీపీ నాయకులు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పవన్ మూడో రోజు పర్యటన
ప్రజల్లో క్లారిటీ..
పెన్షన్ల పంపిణీ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలకు ఓ స్పష్టత వచ్చిందని, ప్రభుత్వంపై విశ్వాసం కలిగిందనే ప్రచారం జరుగుతోంది. వాలంటీర్లు లేకపోతే ఇంటింటి పెన్షన్ల పంపిణీ సాధ్యంకాదని వైసీపీ నాయకులు ఇప్పటివరకు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ జులై నెల పెన్షన్లను సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయించారు. దీంతో వైసీపీ ఎన్నికలు ముందు చెప్పినవన్నీ అవాస్తవాలని తేలిపోయింది. మరోవైపు ఏప్రియల్ నుంచి పెన్షన్ల పెంపు అమలుచేస్తానని ఇచ్చిన మాట ప్రకారం జులైలో వృద్ధులు, వితంతువులకు రూ.7వేలు అందజేశారు. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందనే చర్చ నడుస్తోంది.
Andhra Pradesh: టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై వైసీపీ సంబరాలు..!
ప్రజలు తిరస్కరించినా..
వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వంకుండా ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పినా.. నాయకుల తీరు మారడంలేదనే చర్చ జరుగుతోంది. ఇంకా తాము అధికారంలోనే ఉన్నామనే రీతిలో ప్రవర్తిస్తున్నారని.. ఇప్పటికైనా కొంత అహంకారం తగ్గించుకుని ప్రజా నాయకులుగా ముందుకువెళ్లడం బెటరంటూ రాజకీయ పండితులు సలహా ఇస్తున్నారు. అధికారపక్షాన్ని నెలరోజుల్లోనే ఇబ్బంది పెట్టాలనే ఆలోచనను వీడి.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అధికారపక్షానికి మద్దుతు ఇవ్వడంతో పాటు.. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తీరు మార్చుకుంటారా.. లేదో వేచి చూడాల్సిందే.
AP News: ఆగని అక్రమ రేషన్ తరలింపు.. తాజాగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News