Share News

CM Chandrababu: 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు భేటీ.. వార్నింగ్ తప్పదా

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:23 PM

Andhrapradesh: ఈనెల 18న ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలతో సమావేశం అవనున్న సీఎం చంద్రబాబు.. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాలలో ఎమ్మెల్యేల జోక్యం చేసుకోవడంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

CM Chandrababu: 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు భేటీ.. వార్నింగ్ తప్పదా
CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 15: తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) భేటీ అవనున్నారు. ఈనెల 18న ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలతో సమావేశం అవనున్న సీఎం.. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాలలో ఎమ్మెల్యేల జోక్యం చేసుకోవడంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

NRI: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు అవమానం! జాతీయపతాకాన్ని రూపొందించమని అడగడంతో..


అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపరంగా ఎమ్మెల్యేలతో తొలిసారిగా చంద్రబాబు భేటీ అవుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ క్రమంలో సమావేశానికి సంబంధించి ఎజెండాను పార్టీ కేంద్ర కార్యాలయం తయారు చేస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో చేస్తున్న దందాలపై కూడా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇవ్వనున్న ట్లు తెలుస్తోంది.


హెచ్చరికలతో వెనక్కి తగ్గిన ఎమ్మెల్యేలు

మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు... దరఖాస్తుల దాఖలు దశలోనే పలువురు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాల కోసం లక్ష దరఖాస్తులు వస్తాయని, తద్వారా రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని మొదట అంచనా వేశారు. కానీ మితిమీరిన రాజకీయ జోక్యంతో మొదట్లో చాలా స్వల్ప సంఖ్యలో దరఖాస్తులు అందాయి. దీనిపై ఎక్సైజ్‌ శాఖలోనూ ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ‘దుకాణం మాదే’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. జిల్లాల వారీగా జరుగుతున్న దందాలు, నాయకులు ఎలా జోక్యం చేసుకుంటున్న తీరును సూటిగానే వివరించింది. దీనిపై సీఎం కార్యాలయం తీవ్రంగా స్పందించింది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుని, దరఖాస్తులను అడ్డుకుంటున్న వారికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి గట్టిగా హెచ్చరించింది. నేరుగా సీఎం కార్యాలయం నుంచి హెచ్చరికలు రావడంతో ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు. మరోవైపు ఎక్సైజ్‌ శాఖ కూడా దరఖాస్తుదారులకు ఆన్‌లైన్‌లో ఎక్కువ వెసులుబాటు కల్పించింది. సమాచారం కోసం ఎక్సైజ్‌ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా మొత్తం వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టింది. దీంతో దరఖాస్తుల సంఖ్య క్రమక్రమం పెరిగింది.

Viral: వార్నీ.. రిజైన్ లెటర్‌లో అలా ఎవరైనా రాస్తారా? అసలేం రాశాడో తెలిస్తే పగలబడి నవ్వుకోవాల్సిందే..


మరోవైపు కొత్త మద్యం షాపుల వ్యవహారంలో తలదూర్చవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఇదివరకే హెచ్చరించారు. ‘‘ప్రభుత్వం పారదర్శకంగా కొత్త షాపులను ఏర్పాటు చేస్తోంది. వాటికి ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. వారిని నియంత్రించడానికి, ఒత్తిడి తేవడానికి ఏ ఎమ్మెల్యే ప్రయత్నించినా ఊరుకొనేది లేదు. వ్యాపారాలు చేసుకొనే హక్కు అందరికీ ఉంది. ఎవరూ అడ్డుకోవద్దు. రాజకీయ పరిపాలన అంటే ప్రతిదానిలో తలదూర్చడం కాదు. ప్రజలకు మంచిచేసే పాలన. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేయవద్దు’’ అని ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు తేదీ ఖరారు..

AP Highcourt: జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 24 కొట్టివేత

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2024 | 03:56 PM