Share News

CM Chandrababu: ఇలా అయితే ఆల్టర్నేట్ తప్పదు.. మంత్రికి సీఎం వార్నింగ్..

ABN , Publish Date - Nov 04 , 2024 | 01:08 PM

Andhrapradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఓ మంత్రికి క్లాస్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేతల తీరుతో పార్టీకి ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా సీఎం చంద్రబాబు అలర్ట్‌గా ఉంటూ.. పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు స్వీట్ వార్నింగ్స్ ఇస్తూనే.. హద్దులు దాటుతున్న వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ హెచ్చరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఓ మంత్రికి కూడా గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు సీఎం.

CM Chandrababu: ఇలా అయితే ఆల్టర్నేట్ తప్పదు.. మంత్రికి సీఎం వార్నింగ్..
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 4: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu)... రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు శాయశక్తులా శ్రమిస్తున్న నేత. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. తాను పరుగులు పెట్టడంతో పాటు ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే తప్పు చేసిన నాయకుల పట్ల కూడా సీఎం సీరియస్‌గా ఉంటున్నారు. స్వంత పార్టీ నేతలను కూడా క్రమశిక్షణలో ఉండాలని.. ఎలాంటి తప్పు చేయకూడదని గట్టిగానే చెబుతున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని నేతలకు నిర్దేశిస్తున్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. తన మన అనే తేడా లేకుండా సొంత పార్టీ నేతలకు కూడా వార్నింగ్‌లు ఇస్తున్నారు సీఎం. నేతల తీరుతో పార్టీకి ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా సీఎం అలర్ట్‌గా ఉంటూ.. పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు స్వీట్ వార్నింగ్స్ ఇస్తూనే.. హద్దులు దాటుతున్న వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ హెచ్చరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఓ మంత్రికి కూడా గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు సీఎం. ఇంతకీ ఎవరా మంత్రి.. ఎందుకు సీఎం క్లాస్ పీకారో ఇప్పుడు తెలుసుకుందాం.

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల


మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు క్లాస్‌ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ సభ్యత్వ నమోదుకు సంబంధించి మంత్రికి సీఎం గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సభ్యత్వ నమోదులో వెనుకబడి ఉన్నారని.. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా ఎమ్మెల్యేను, మంత్రిని చేశానని.. రాజకీయాలపై సీరియస్‌నెస్ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు నిరూపించుకోకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందంటూ మినిస్టర్‌కు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు.


ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే

‘‘సభ్యత్వ నమోదులో అందరికంటే వెనుకబడి ఉన్నావు. రాజకీయాలపై నీకు సీరియస్ తనం రాలేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, ఫస్ట్ టైం మంత్రివి సభ్యత్వ నమోదులో ఎక్కడున్నావో చూసుకున్నావా. 29% శాతం మాత్రమే సభ్యత్వం నమోదు అయింది. 9000 గాను 2630 మాత్రమే చేశారు. ఫస్ట్ టైం వచ్చావు నీకు పార్టీ చాలా గౌరవించింది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన నీకు ఎమ్మెల్యే ఇచ్చి మంత్రిని చేశాం. నీకు పట్టుదల లేకపోతే ఎలా . సీరియస్‌గా తీసుకోవాలి. నా బాధ్యత నేను చేస్తున్న మీ వాయిస్ మీరు చేయాలి. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలు ఎందుకు. మీరు పని చేయకపోతే ఎమ్మెల్యేగా ఎలా ప్రూవ్ చేసుకుంటారు. మీరు ప్రూవ్ చేసుకోకపోతే ఆల్టర్నేట్ చూసుకుంటా. ఎక్స్పెక్టేషన్స్‌కు తగ్గట్టు పని చేయలేదని ప్రజలకు కూడా తెలియజేస్తా. నేను 95 సీఎంని అని అందరికీ చెప్తున్నా’’ అంటూ మంత్రి వాసంశెట్టి శుభాష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఈ వ్యవహారం పార్టీతో పాటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి..

YSRCP: మీ ఫ్యామిలీ మొత్తాన్నీ లేపేస్తాం

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్‌ యాప్‌..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 01:17 PM