Share News

CM Chandrababu: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు

ABN , Publish Date - Aug 19 , 2024 | 11:47 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగన్నవరం ఎయిర్పోర్ట్‌కు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయయలుదేరి వెళ్లనున్నారు. ఆపై తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి శ్రీ సిటీకి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్ళనున్నారు.

CM Chandrababu: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 19: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గన్నవరం ఎయిర్పోర్ట్‌కు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయయలుదేరి వెళ్లనున్నారు. ఆపై తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి శ్రీ సిటీకి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా శ్రీ సిటీలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను సీఎం చేయనున్నారు. అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు ఏరియాను సీఎం సందర్శించనున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో సోమశిల డ్యాం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

నేడే ఒంగోలులో మాక్‌ పోలింగ్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ


వరదల సమయంలో డ్యాం పూర్తి సామర్ధ్యం కంటే అధికంగా నీటి నిల్వ వచ్చి చేరింది. దీంతో అధికారులు ఒక్కసారిగా 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి ఉధృతికి డయాఫాం, అప్రాన్, శివాలయం, అధికారుల భవనాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే కేంద్ర బృందాలు రెండు సార్లు డ్యాంను పరిశీలించి, ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అయినా జగన్ ప్రభుత్వం లెక్కచేయని పరిస్థితి.

Abhishek Singhvi: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్



నిధుల కొరతతో కాంట్రాక్టర్లు కూడా పనులను నిలిపివేశారు. ఈక్రమంలో సీఎం చంద్రబాబుకి సోమశిల డ్యాం పరిస్థితిని మంత్రులు నిమ్మల, ఆనం, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి వివరించారు. ఈ రోజు మధ్యాహ్నం సోమశిలకు సీఎం చంద్రబాబు వెళ్లున్నారు. స్థానిక రైతులతో సమావేశమవుతారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి..

Raksha Bandhan: ఈ రాఖీ వెరీ స్పెషల్ గురూ.. దేశ, విదేశాల్లో భారీ డిమాండ్..

KTR: కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి భేటీ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 11:49 AM