CM Chandrababu: బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా..
ABN , Publish Date - Jul 07 , 2024 | 04:50 PM
ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆరా తీశారు. జగ్గయ్యపేట మండలం బూదవాడ(Budawada) గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం(Ultratech cement factory)లో బాయిలర్ పేలి 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తక్షణం బాధితులకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆరా తీశారు. జగ్గయ్యపేట మండలం బూదవాడ(Budawada) గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం(Ultratech cement factory)లో బాయిలర్ పేలి(Boiler explosion) 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తక్షణం బాధితులకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం వివరాలను సీఎంవో సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని అన్ని సదుపాయాలు ఉన్న ఆస్పత్రులకు తరలించారని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడడంతోపాటు ప్రభుత్వం నుంచీ సాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
జగ్గయ్యపేట మండలం బూదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో సుమారు 20మందికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు, తోటి సిబ్బంది బాధితులను జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. బాధితులంతా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బాయిలర్ పేలి తీవ్రగాయాలతో ఉన్న కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ బూదవాడ గ్రామస్థులు కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేయడంతో ఉద్రక్త వాతావరణం నెలకొంది.
ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఇప్పటికే స్పందించారు. పేలుడుకు ప్రీ హీటర్ లోపమే కారణమని ప్రాథమికంగా తేలిందని మంత్రి చెప్పారు. ప్రీ హీటర్ నిర్వహణలో అల్ట్రాటెక్ సంస్థ పూర్తిగా విఫలమైందని, అందుకే ప్రమాదం జరిగినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
Home Minister Anitha: వైసీపీ ప్రభుత్వం నాపై 23కేసులు పెట్టింది: హోంశాఖ మంత్రి అనిత
Home Minister Anitha: బాలిక హత్య దురదృష్టకరం: హోంమంత్రి అనిత