Share News

CM Chandrababu: నేడు ఏయే శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారంటే..

ABN , Publish Date - Sep 19 , 2024 | 09:31 AM

Andhrapradesh: ఈరోజు పలు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు జరుపనున్నారు. రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ మీద సమీక్ష చేయనున్నారు. అనంతరం సెర్ఫ్ ‌పై సీఎం సమీక్ష చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానంలో పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.

CM Chandrababu: నేడు ఏయే శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారంటే..
CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 19: ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) పాలనను ముందు తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో వివిధ శాఖలలో నెలకొన్న అవినీతి, అక్రమాలను బయటపెడుతూ.. వాటిని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు సీఎం. ఎప్పటికప్పుడు పలు శాఖలపై సమీక్షలు, రివ్య్యూలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లో అధికారుల పనితీరుపైనా ఆరా తీస్తున్నారు. ఈరోజు పలు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు జరుపనున్నారు. రూరల్ వాటర్ సప్లై, జల్ జీవన్ మిషన్ మీద సమీక్ష చేయనున్నారు. ఇంటింటికీ కుళాయి నీరు అందించే అంశంపై చర్చించనున్నారు. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగు నీరు అందించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం. పూర్తిగా పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. సెర్ఫ్ పనితీరుపైనా సమీక్ష చేయనున్నారు. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. డ్వాక్రా సంఘాలతో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేయించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆపై ఈరోజు మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానంలో పోర్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తరువాత ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్, రిలేషన్స్ పై రివ్యూ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వెలగపూడి సచివాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

Nara Lokesh: చిత్తూరు జిల్లాకు మంత్రి నారా లోకేశ్.. ఎందుకంటే?


ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్

మరోవైపు ఈరోజు రాష్ట్రంలో ఉచిత ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పోర్టల్‌ను అవిష్కరించనున్నారు. దీంతో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఇసుక రవాణా దారుల వరకు ఎలాంటి తప్పులు చెయ్యకుండా పోర్టల్ రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు. ఇసుక స్టాక్ ఎంత ఉంది... సరఫరా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి.. అనే వివరాలతో పోర్టల్ రూపొందించారు. 2వేల చదరపు అడుగుల లోపు నిర్మాణాల వరకు సాధారణ బుకింగ్ పరిధిలో... 2వేల చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుకింగ్ చేసుకోవాలి. ఏపీ శాండ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్, యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఉచిత ఇసుక విధానం నేపథ్యంలో ఇసుక కావాల్సినవారు ఇంటి వద్ద నుంచే నేరుగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.


రేపు శ్రీకాకుళంకు సీఎం...

అలాగే సీఎం చంద్రబాబు రేపు(శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో రేపు చంద్రబాబు బహిరంగ సభ జరుగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు మొదటిసారి జిల్లాకు వస్తున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ జిల్లా శ్రేణులలో ఉత్సాహం నెలకొంది.


ఇవి కూడా చదవండి...

Balineni Srinivasa Reddy: పవన్‌తో నేడు బాలినేని భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

Waqf Amendment Bill: నేడు వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ భేటీ.. త్వరలో పార్లమెంటులో బిల్లు ఆమోదం!

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2024 | 10:46 AM