Share News

Rahul Gandhi: ప్రతీ భక్తుడిని బాధపెడుతోంది.. క్షుణ్ణంగా పరిశీలించాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 09:41 AM

Andhrapradesh: ‘‘తిరుపతిలోని వేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. లార్డ్ బాలాజీ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల భక్తులకు పవిత్రమైన దేవుడు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’’

Rahul Gandhi: ప్రతీ భక్తుడిని బాధపెడుతోంది.. క్షుణ్ణంగా పరిశీలించాలి
Congress Leader Rahul Gandhi

న్యూఢిల్లీ/అమరావతి 21: తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Laddu) ప్రసాదం కల్తీపై రాష్ట్రంలోనే దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడకంపై ప్రతీఒక్కరూ తప్పుబడుతున్న పరిస్థితి. ఈ వివాదంపై హిందువులు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఈ అపచారంపై రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా తిరుపతి లడ్డు కల్తీ నెయ్యిపై వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆ శ్రీనివాసుడు భారతదేశమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులకు పవిత్ర దేవుడని అన్నారు. మతపరమైన ప్రదేశాల పవిత్రతను అధికారులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్రంగా కలకలం రేపుతోందని రాహుల్ పేర్కొన్నారు.

బాధ్యులపై చర్యలు తప్పవ్‌


రాహుల్ ట్వీట్ ఇదే..

‘‘తిరుపతిలోని వేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. లార్డ్ బాలాజీ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల భక్తులకు పవిత్రమైన దేవుడు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అధికారులు మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలి’’ అంటూ ఎక్స్‌(ట్వీట్టర్‌)లో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Delhi CM: నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం


రంగంలోకి కేంద్ర సర్కార్...

కాగా.. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది. స్వామిభక్తుల నుంచి ప్రముఖుల దాకా.. అందరూ చలించిపోతున్నారు. నాటి జగన్‌ ప్రభుత్వ నిర్వాకంపై భగ్గుమంటున్నారు. సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు లేఖలు రాస్తున్నారు. దిద్దుబాటు ప్రారంభించిన సర్కారు..తిరుమల సంప్రోక్షణకు ఆదేశించింది. శ్రీవారి లడ్డూను జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసిన వ్యవహారం జాతీయస్థాయిలో గగ్గోలు రేపుతోంది. లడ్డూ తయారీకి గత ప్రభుత్వం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు తేలడంతో వైసీపీ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూను కలుషితం చేయడాన్ని కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం రంగంలోకి దిగారు. సీఎం చంద్రబాబుకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వివరాలు పంపిస్తే విచారణకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబుకు తెలిపారు. హిందూ విశ్వాసాల పట్ల ఇది కుట్ర, ద్రోహం, క్షమించరాని నేరమంటూ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్‌, బండి సంజయ్‌, పలువురు ఎన్డీయే, బీజేపీ జాతీయ నేతలు తీవ్రంగా స్పందించారు.


ఇవి కూడా చదవండి

LIC SIP: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి రూ. 100 సిప్

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2024 | 09:52 AM