Share News

AP Cabinet: రూ.99కే నాణ్యమైన మద్యం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:12 PM

Andhrapradesh: వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై ఏపీ కేబినెట్‌లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్‌‌కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు.

 AP Cabinet: రూ.99కే నాణ్యమైన మద్యం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
AP Cabinet Meeting

అమరావతి, సెప్టెంబర్ 18: ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించింది. అలాగే వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్‌లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్‌‌కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు.

One Nation One Election: 41 ఏళ్ల క్రితమే ప్రతిపాదన.. జమిలీ వెనక చరిత్ర తెలుసా


వలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వం సాక్షి పత్రిక కొనుగోళ్లల్లో చేసిన అవకతవకలపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. రెండేళ్లల్లోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 205 కోట్లు ఖర్చు చేశారని మంత్రిమండలి సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంతుంది..? ఏ నిబంధనల ప్రకారం సాక్షి పత్రిక కొనుగోళ్లకు నిధులు కేటాయించారనే దానిపైనా ఎంక్వైరీ వేయాలని పలువురు మంత్రులు పేర్కొన్నారు.


రూ.99కే మద్యం.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

అలాగే కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.100 లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

Congress: పార్టీలకతీతంగా అభివృద్ధి ఫలాలు.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తగ్గం: రేవంత్



హామీని నిలబెట్టుకున్న సీఎం..

బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి చంద్రబాబు కేబినెట్ సిఫార్సు చేసింది. బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

Sharmila: రాహుల్‌కు బేషరుతుగా క్షమాపణ చెప్పాల్సిందే.. షర్మిల డిమాండ్

Vishnukumar Raju: ఏపీ అభివృద్ధికి కూటమి సర్కార్ కృషి..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 18 , 2024 | 05:05 PM