Necessary goods: వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభం
ABN , Publish Date - Sep 06 , 2024 | 01:12 PM
Andhrapradesh: వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలైంది. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు, కందుల దుర్గేష్, ఎంపి కేశినేని చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 6: వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలైంది. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), అచ్చెంనాయుడు (Atchannaidu), కందుల దుర్గేష్, ఎంపి కేశినేని చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. 1200 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి అందేలా విధంగా ప్లాన్ చేశామని చెప్పారు.
Kolkata Doctor Case: సుప్రీంలో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు చుక్కెదురు..
ఈ విపత్తు వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడ్డారని.. అందరూ బాధ్యతగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రేపు పండుగ అయినా పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అనేక జిల్లాల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చిందని తెలిపారు. నాలుగు రోజుల్లో అందరికీ సరుకులు అందేలా చేస్తామన్నారు. నీళ్లు ఉన్న ప్రాంతాల్లో తోపుడు బళ్ల ద్వారా సరుకులు లోపలకు తీసుకెళతామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?
ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఇంత విపత్తులో బాధితులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. చంద్రబాబు ఈ వయసులో ప్రజల కోసం ఎంతో శ్రమ పడుతున్నారని.. వారికి అన్ని విధాలా సహాయక చర్యలు అందేలా ఆదేశాలు ఇస్తున్నారని అన్నారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పంచాయతీల్లో పరిస్థితి పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే లు, అధికారులు ముంపు ప్రాంతాల్లో తిరుగుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ ఆహారం, నీరు, బ్రెడ్, పాలు రెండు మూటలా అందిస్తున్నారన్నారు. ఇప్పుడు నిత్యావసర వస్తువులు నెల రోజుకు సరిపడా ఇస్తున్నారన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో అందరూ అర్ధం చేసుకుని ముందుకు సాగాలని కోరారు. వరద బాధితులు అందరకీ అన్నివిధాల సాయం అందించడానికి ప్రభుత్వం సన్నద్దంగా ఉందని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Heavy Rains: భారీ వర్షాలతో తెలంగాణ ఏ రేంజ్‌లో నష్టం జరిగిందంటే?
Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News