Share News

AP Elections: కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

ABN , Publish Date - May 13 , 2024 | 05:39 AM

కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా, మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులను విధుల్లో నియమించారు.

AP Elections: కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు

కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) స్థానాలకు పోలింగ్ (Polling) జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Election Commission) అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా, మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులను (Women Police) విధుల్లో నియమించారు. మగ పోలీసులు లేకుండా కేవలం మహిళా కానిస్టేబుల్స్‌ను పెట్టారు. ఇదేమని అడిగితే రూట్ లెవల్ ఆఫీసర్ చూసుకుంటారని అధికారులు చెబుతున్నారు. విధులు నిర్వహించేందుకు మహిళా కానిస్టేబుల్స్ ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.


కాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగోడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌కు సమయం వచ్చేసింది. ఐదేళ్ళకోమారు పాలకుల రాతలు మార్చే అపూర్వ ఆయుధం ఓటరు చేతికొచ్చింది. దాన్ని వినియోగించుకునే క్రమంలో పైచేయి ప్రలోభాలదా..? విచక్షణదా..? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. రానున్న ఐదేళ్లు తమ భవిష్యత్‌, రాష్ట్ర అభివృద్ధిని నిర్దేశించే పాలకులను ఎంపిక చేసుకొనేందుకు ఓటు ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,14,01,887 ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 2,03,39,851 మంది.. మహిళలు 2,10,58, 615 మంది.. ఇక ఇతరులు 3,421 మంది ఉన్నారు. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,389 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!

కూటమిలో జోష్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 05:41 AM