AP News: మెగా డీఎస్సీ కోరుతూ మంత్రి బొత్స ఆఫీస్ ముట్టడికి డీవైఎఫ్‌ఐ యత్నం
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:13 AM
Andhrapradesh: మెగా డీఎస్సీ కోరుతూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి డీవైఎఫ్‌ఐ యత్నించింది. బుధవారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి డీవైఎఫ్‌ఐ యత్నించగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు నినాదాలు చేశారు.
విజయవాడ, జనవరి 3: మెగా డీఎస్సీ (Mega DSC) కోరుతూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) క్యాంప్ ఆఫీస్ ముట్టడికి డీవైఎఫ్‌ఐ (DYFI) యత్నించింది. బుధవారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి డీవైఎఫ్‌ఐ యత్నించగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి (CM YS Jaganmohan Reddy) వ్యతిరేకంగా డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. 25000 పోస్టులతో మెగా డీఎస్సీ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్ళు గడిచినా ఒక్కసారి కూడా టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. డీఎస్సీ విడుదల చేయని ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని మండిపడ్డారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సీ పేరుతో నమ్మించి జగన్ నిరుద్యోగ అభ్యర్ధులను మోసం చేశారని డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..