Share News

AP News: విజయవాడలో చేనేత కళాకారుల వాక్

ABN , Publish Date - Aug 07 , 2024 | 09:31 AM

Andhrapradesh: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు బుధవారం ఉదయం వాక్ నిర్వహించాను. స్టెల్లా కాలేజ్ నుంచి పంట కాలువ రోడ్డు వరకు కళాకారులు వాక్ చేయనున్నారు. చేనేత కళాకారులతో పాటు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖా రాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ పాల్గొన్నారు.

AP News: విజయవాడలో చేనేత కళాకారుల వాక్
National Handloom Day

విజయవాడ, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day) సందర్భంగా విజయవాడలో (Vijayawada) చేనేత కళాకారులు బుధవారం ఉదయం వాక్ నిర్వహించాను. స్టెల్లా కాలేజ్ నుంచి పంట కాలువ రోడ్డు వరకు కళాకారులు వాక్ చేయనున్నారు. చేనేత కళాకారులతో పాటు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత (Minister Savitha) , తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు (MLA Gadde Rammohan Rao), కమిషనర్ టెక్స్టైల్స్ రేఖా రాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ పాల్గొన్నారు.

వినేశ్‌ వండర్‌


చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి మరీ యువత ఎంతో ఉత్సాహంగా వాక్‌లో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ... జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు.

విద్యార్థుల పంతం నెగ్గింది


చేనేత కళాకారుల కలలు మరుగున పడ్డాయన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కళాకారులకు ఎంతో అండగా నిలుస్తుందన్నారు. చేనేత కళాకారుల కలలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

TG : బీరు మరింత ప్రియం!

CM Revanth Reddy: చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 07 , 2024 | 09:34 AM